శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (17:06 IST)

చేతులు మృదువుగా, కోమలంగా ఉండాలంటే?

మనలో చాలామంది ముఖం అందంగా కనిపించాలని ఎక్కువగా ఆశపడుతుంటారు. అయితే శరీరంలో ముఖ్యభాగమైన చేతులు కూడా చూపరులను ఆకర్షించేలా ఉంటే బాగుంటుందని ఆలోచించరు. మనిషి పరిశుభ్రతను చేతులు చూసి కనిపెట్టవచ్చని మన పెద్దలు అంటుంటారు. 
 
రోజూ రాత్రి నిద్రపోవడానికి ముందు గ్లిజరిన్‌, రోజ్‌వాటర్‌ రెండింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకు రాసుకోవాలి. ఇలా చేస్తే చేతులు ఎంతో మృదువుగా, కోమలంగా ఉంటుంది. గరుకుగా ఉండే చేతులకు పెట్రోలియం జెల్లీని రోజూ రాసుకోవాలి. 
 
ఎండలోకి వెళ్లేటప్పుడు చేతులు నల్లబడకుండా ఉండాలంటే తప్పనిసరిగా సన్‌ బ్లాక్‌ క్రీమ్‌ని వాడాలి. చేతి వేళ్లు అందంగా కనిపించాలంటే గోళ్లను ఎప్పటికప్పుడు కట్‌ చేయాలి. అలాకాకుండా వాటిని పెంచితే గోళ్లల్లో మట్టి దూరి చూడడానికి అందవికారంగా ఉంటాయి. 
 
కొంచెం పాలలో నిమ్మరసం, తేనె, శెనగపిండి కలిపి పేస్టులా చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చేతులకు రాసుకోవాలి. ఇలా చేస్తే చేతులు ఎంతో అందంగా ఉంటాయి.