సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (16:57 IST)

పవన్ కళ్యాణ్ స్పందించకుంటే నడిరోడ్డుపై బట్టలూడదీస్తానంటున్న నటి..

క్యాస్టింగ్ కౌచ్ ఒక్కొక్కటిగా సినీ పరిశ్రమలో బయటపడుతూనే ఉంది. అవకాశాల పేరుతో అవసరం తీర్చుకోవడం కొంతమంది నిర్మాతలు, దర్శకులకు అలవాటుగా మారిపోతోంది. కొంతమంది హీరోయిన్లు లొంగిపోతే మరికొంతమంది తమకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. 
 
అటు రాజకీయాల్లోను, ఇటు సినీపరిశ్రమలోను చురుగ్గా ఉంటూ వస్తున్న నటి సునీత బోయ ఒక నిర్మాతపై ఆరోపణలు చేస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్లో అవకాశాలు ఇస్తానని చెప్పి నిర్మాత బన్నీ వాసు తనను బాగా వాడుకున్నాడని, అయితే తనకు అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
 
అంతేకాదు తన వద్ద ఆధారాలుండటంతో అది ఎక్కడ బయటపెడతానేమోనని.. తనపైనే తప్పుడు కేసులు పెట్టించి వేధింపులకు దిగుతున్నారని ఒక సెల్ఫీ వీడియో పెట్టింది. అది కూడా ఫిలిం ఛాంబర్ ఆఫీస్ ముందే. తనకు తానుగా చేతులను ఫిలిం ఛాంబర్ గేట్లకు కట్టేసుకుని సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్, ఫేస్ బుక్‌లలో పోస్ట్ చేసింది. 
 
అర్థరాత్రి ఈ హైడ్రామా మొత్తం జరిగితే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతంలో సినీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఈమె  ఆరోపించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చురుకైన పాత్ర పోషించింది సునీత. శ్రీరెడ్డికి గట్టిగా సమాధానం ఇస్తూ కొన్ని పోస్టింగ్‌లు కూడా పెట్టింది. అలా సునీత బోయ మంచి పేరే తెచ్చుకుంది.
 
అయితే ఉన్నట్లుండి సినీ నిర్మాతపై ఆరోపణలు చేయడం, తన సమస్యపై అల్లుఅరవింద్‌తో పాటు పవన్ కళ్యాణ్ స్పందించకుంటే పోలీసు స్టేషన్‌కు ఎదురుగా నడిరోడ్డుపై బట్టలూడదీసుకుని వెళతానని బెదిరించింది. ప్రస్తుతం తనను జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ నుంచి బంజార్ హిల్స్ పోలీస్టేషన్‌కు తీసుకెళుతున్నారని.. తన సమస్య తీర్చండంటూ పవన్ కళ్యాణ్‌ను కోరుతోంది. అయితే పోలీసులు మాత్రం ఆమెకు మతిస్థిమితం సరిగ్గా లేదని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.