సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే... చీఫ్ గెస్ట్ పవర్ స్టార్?

Syra
శ్రీ| Last Modified గురువారం, 5 సెప్టెంబరు 2019 (15:04 IST)
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేష‌న్ సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సంచ‌ల‌న చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. రామ్ చ‌ర‌ణ్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని అందించేందుకు ఎంత‌గానో శ్ర‌మిస్తున్నారు. ఈ మూవీని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు.

అక్టోబ‌ర్ 2న సైరా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే... ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్క‌డ చేయాలి..? ఎప్పుడు చేయాలి..?
ఎలా ఉండాలి అనే విష‌యంలో చిరు, చ‌ర‌ణ్ గ‌త కొన్ని రోజులుగా టీమ్‌తో చ‌ర్చిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... క‌ర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయ‌డానికి ఫిక్స్ అయ్యార‌ట‌. ల‌క్ష‌ల మంది హాజ‌ర‌య్యేలా ఏర్పాట్లు చేయాల‌నుకుంటున్నార‌ని తెలిసింది.

అయితే... ఎప్పుడు చేయాలనేది ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేద‌ట‌. రెండు రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని తెలిసింది. క‌ర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ త‌ర్వాత బెంగుళూరులో కూడా భారీ స్ధాయిలో సైరా వేడుక‌ను నిర్వ‌హించాలి అనుకుంటున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రి-రిలీజ్ ఈవెంటుకి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారని టాక్.దీనిపై మరింత చదవండి :