సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 19 ఆగస్టు 2019 (15:27 IST)

చరణ్ నా కోరిక తీర్చాడు.. తండ్రిగా చాలా గర్వపడుతున్నా: మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటించిన హిస్టారికల్ ఫిల్మ్ సైరా హంగామా మొదలైంది. మేకింగ్ వీడియోతో రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ సినిమా టీజర్‌ని ఈ నెల 20న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్‌గా కోడలు ఉపాసన యూ ట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ రామ్ చరణ్ గురించి అద్భుతంగా మాట్లాడారు.
 
రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. ‘ఎవరైనా నా జీవితంలో మీరు గొప్పగా ఫీల్ అయ్యే అచివ్మెంట్ ఏమిటని అడిగితే.. రామ్ చరణ్ అని చెబుతాను. ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నా. రామ్ చరణ్ తప్పకుండా నా వారసత్వాన్ని మరో లెవెల్‌కి తీసుకు వెళతాడు. నా నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో 150 సినిమాలు చేశాను. 
 
కానీ మగధీర – రంగస్థలం వంటి సినిమాలు నేను చేయలేను. సైరా సినిమాతో చరణ్ ఆ కోరికను తీర్చాడు. ఒకవేళ రంగస్థలం వంటి అవకాశం వస్తే అలాంటి పాత్రలో కనిపించడానికి ఒప్పుకునేవాడిని కాదు. చరణ్ ఆ సినిమాలో అద్భుతంగా నటించాడు’ అని అన్నారు.