ఆపరేషన్ ఆకర్ష్ : బీజేపీలోకి చిరంజీవి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కమలనాథులు ఆపరేషన్ ఆకర్ష్‌ను అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక టీడీపీ నేతలు ఆ పార్టీలో చేరారు. వీరిలో ప్రధానంగా ముగ్గురు రాజ్యసభ సభ్యులు మొదటివరుసలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బలమైన సామాజికవర్గమైన కాపు ఓట్లను తమవైపునకు తిప్పుకునేందుకు ఆ వర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని తమతో చేతులు కలిపేలా పాచికలు వీచారు.
ఇవి సక్సెస్ కావడంతో చిరంజీవి కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి.. త్వరలోనే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ఆయనతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం.
చిరంజీవికి కమలనాథులకు మధ్య వారధిగా బీజేపీ నేత రాంమాధవ్ వ్యవహరిస్తున్నారు. తన 151వ చిత్రం ‘సైరా’ విడుదల తర్వాత చిరంజీవి బీజేపీలో ఆయన చేరే అవకాశాలున్నట్టు సమాచారం. కాగా, ఈ నెల 18న హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. నాంపల్లిలో నిర్వహించే ఈ సభ ద్వారా టీ-టీడీపీ నేతలు పలువురు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.