సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2019 (15:46 IST)

#మూడు రాజధానులు.. బాంబు పేల్చిన జగన్మోహన్ రెడ్డి..

దక్షిణాఫ్రికా మూడు రాజధానుల గురించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఏపీ మూడు రాజధానులు వచ్చే అవకాశం వుందని జగన్ చెప్పారు. దక్షిణాఫ్రికా దేశానికి ఒకటి కాదు రెండు కాదు మూడు రాజధానులు ఉన్నాయి. అలా మూడు రాజధానులు ఉండడం వెనుక ఆర్థిక, చారిత్రక, సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. అక్కడ శాసన విభాగం కేప్ టౌన్‌లో కొలువుదీరింది.  
 
ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. వారం పాటూ సాగిన సమావేశాల్లో సీఎం జగన్ చివరి రోజు రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ పెద్ద బాంబే పేల్చారు జగన్. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్‌, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలు జ్యుడిషియరీ కేపిటల్ ఉండొచ్చన్నారు. అయితే రాజధానిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటామన్నారు. జగన్ మూడు రాజధానులు అంటూ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. టీడీపీ, జనసేనలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే.. కొన్ని పార్టీలు మాత్రం స్వాగతించాయి.
 
ఇదిలా ఉంటే జగన్ నిర్ణయంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఏపీ సీఎం నవ్వుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసి.. పిచ్చి వాడి చేతిలో రాయి.. జగన్ చేతిలో రాజధాని.. రెండిటికీ ఏమి తేడా లేదు.. ఏటు విసిరుతారో ఎక్కడ పడుతుందో దేవుడికి కూడా తెలియదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
అలాగే జగన్ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ.. ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రాకి మూడు రాజధానులు అవసరమైతే ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు పన్నెండు రాజధానులు కావాలి అంటూ సెటైర్లు పేల్చారు. జగన్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని.. కులాలు, మతాల వారీగా అభివృద్ధి ఉండకూడదన్నారు.