శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. అటవీ అందాలు
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (22:00 IST)

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో తెలంగాణకు రెండు అవార్డులు

వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (WCS) నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ అవార్డుల్లో తెలంగాణకు రెండు అవార్డులు దక్కాయి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో రెండు, మూడు స్థానాల్లో అవార్డులను తెలంగాణ అటవీ శాఖ అధికారులు సాధించారు. 
 
అదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసరుగా పనిచేస్తున్న చంద్రశేఖర రావు, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యంలో తీసిన రాయల్ బెంగాల్ టైగర్ ఫోటోకు ఉత్తమ రెండో స్థానం విన్నర్‌గాను, జన్నారం డివిజనల్ అధికారిగా ఉన్న సిరిపురపు మాధవరావు కవ్వాల్ అభయారణ్యలో తీసిన అరుదైన జాతికి చెందిన గద్ద ఫోటోకు (క్రెస్టెడ్ హాక్ ఈగల్ ) మూడో స్థానం దక్కింది.  
 
బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డులను సాధించిన ఇద్దరు అధికారులను అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, అడవి సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్) ఆర్. శోభ, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. దేశ వ్యాప్తంగా అవార్డులు సాధించిన ఫోటోలను వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైట్ తమ వెబ్ సైట్ లోనూ, సోషల్ మీడియా పేజీల్లోనూ ప్రదర్శిస్తోంది.