1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. beauty tips with banana and backing soda

అరటి పండు గుజ్జు, వంటసోడాతో ఫేక్ ప్యాక్ వేసుకుంటే?

అరటి పండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా మారుతుంది. నిమ్మరసాన్ని ముఖానికి, మెడకు ర

banana
అరటి పండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా మారుతుంది. నిమ్మరసాన్ని ముఖానికి, మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వలన నల్లటి వలయాలు తొలగిపోతాయి.
 
గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. టమోటా గుజ్జును ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన ముఖం మృదువుగా, అందంగా మారుతుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
ముఖం తెల్లగా వుంటుంది... పెదవులు నల్లగా వుంటాయి... ఎలా?