ఇంట్లోనే ఫేసియల్ చేసుకోవడం ఎలా..?
చాలామంది వేళకు భోజనం చేస్తున్నారో లేదో కానీ బ్యూటీ పార్లల్‌కి మాత్రం రోజూ వెళ్తుంటారు. ఎక్కువగా చెప్పాలంటే.. ఫేసియల్ కోసం మాత్రమే వెళ్తారు. ఫేసియల్ అందానికి చాలా ఉపయోగపడుతుంది. మరి పార్లల్‌కు వెళ్లలేని వారు ఇంట్లోనే ఫేసియల్ ఎలా చేసుకోవాలో చూద్దాం...
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఫేసియల్ చేసుకోవడమెలాగంటే.. ముందుగా శెనగ పిండితో ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఆ తరువాత ఐస్‌వాటర్‌లో ముంచిన దూదితో ముఖాన్ని తుడుచుకోవాలి.
ఆపై వేడి నీళ్లలో చిటికెడు పసుపు కొన్ని వేపాకులు వేసి ఆవిరి పెట్టి ఈ మిశ్రమంలో పెరుగు, పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. దీనికి ముందుగానే చక్రాల రూపంలో తరిగిన కీరదోస ముక్కలను కళ్లపై ఓ 20 నిమషాల పాటు ఉంచుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
పచ్చి బంగాళాదుంపను తరిగి పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం, ఓట్‌మీల్ పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. దోసకాయ రసంతో ముఖం శుభ్రం చేసుకుంటే ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. బాదం పప్పు పొడి, ఓట్‌మీల్ పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.