సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసిన బంగారం ధరలు.. వెండి కూడా అదే బాటలో..
బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 4.25శాతం (సుమారు రూ. 4,100) పెరిగి 10 గ్రాములకు రూ.1,56,970 వద్ద సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. అమెరికా- యూరప్ మధ్య వాణిజ్య యుద్ధం, డాలర్ బలహీనత కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం కొనుగోళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం ధర భారీగా పెరిగింది. అలాగే బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. ఎంసీఎక్స్ మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ ధర 2.71శాతం పెరిగి కిలోకు రూ. 3,32,451కి చేరింది.
ఫిబ్రవరి 1 నుంచి ఎనిమిది యూరోపియన్ దేశాలపై అమెరికా సుంకాలు విధించనుందని, జూన్‌లో ఈ సుంకాలను 25 శాతానికి పెంచవచ్చని అంచనాలు బంగారం, వెండి ధరలను పెంచేసింది. దీనికి తోడు రూపాయి బలహీనపడటం కూడా దేశీయంగా ధరల పెరుగుదలకు మద్దతునిస్తోంది.
గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడి ఆశయం కారణంగా వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రమాదకర ఆస్తులలో భయాందోళన బంగారం, వెండి అమ్మకాలు, కొనుగోలుకు మద్దతు ఇస్తున్నాయి" అని పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ అన్నారు.
