1. వార్తలు
  2. కెరీర్
  3. కథనాలు
  4. ASCI-s Ad-literacy programme covers 1 mn students across 2,063 schools

2,063 పాఠశాలల్లోని 10 లక్షల మంది విద్యార్థులకు చేరిన ASCI ప్రకటనల అక్షరాస్యత కార్యక్రమం

students
ముంబై: తమ క్లాస్‌రూమ్ ప్రకటనల అక్షరాస్యత చొరవ యాడ్‌వైజ్(AdWise) పది లక్షల(1 మిలియన్) కంటే ఎక్కువ మంది విద్యార్థులకు చేరినట్లు  అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్(ASCI) ఈరోజు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, దిల్లీ ఎన్సీఆర్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అస్సాం, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లోని 2,063 పాఠశాలలకు చెందిన 10,66,374 మంది విద్యార్థులను ఈ కార్యక్రమం పరిధిలోకి తీసుకువచ్చారు.
 
అంతటా విస్తరిస్తున్న డిజిటల్ ప్రకటనలు, అలాగే బ్రాండ్‌లను కంటెంట్‌లోనే మిళితం చేసే ఇన్‌ఫ్లుయెన్సర్ అడ్వర్టయిజింగ్ వంటి సరికొత్త ప్రకటనల ధోరణులను దృష్టిలో ఉంచుకుని ASCI అకాడమీ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. విద్యార్థులు ఈ ఆధునిక ప్రకటనల ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకునేలా, వాటి వెనుక ఉన్న వాణిజ్య ఉద్దేశాలను గుర్తించేలా వారిని సన్నద్ధం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ముందు, ఆ తర్వాత నిర్వహించిన మూల్యాంకన పరీక్షల ఆధారంగా విద్యార్థుల ప్రకటనల అక్షరాస్యత స్థాయిలలో గణనీయమైన మెరుగుదల కనిపించింది.
 
3 నుండి 5 వ తరగతులకు సంబంధించి, ఈ క్రింది సామర్థ్యాలు కలిగిన విద్యార్థుల శాతం.
ప్రకటనల యొక్క అసలు ఉద్దేశాన్ని సరిగ్గా గుర్తించడం: 43% నుండి 94%కి పెరిగింది.
ప్రకటనల క్లెయిమ్స్ విమర్శనాత్మకంగా ఆలోచించడం: 39% నుండి 90%కి పెరిగింది.
ప్రకటనల వెనుక ఉన్న ఒప్పించే ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం: 32% నుండి 87%కి పెరిగింది.
సాధారణ కంటెంట్‌లా నటిస్తూ వచ్చే ప్రకటనలను గుర్తించడం: 36% నుండి 90%కి పెరిగింది.
ప్రకటనలలో వాగ్దానం చేసిన వాటిని నమ్మడానికి ముందు ఏం చేయాలో అర్థం చేసుకోవడం 37% నుండి 93% కి పెరిగింది.
6 నుండి 8వ తరగతుల విద్యార్థులలో, క్రింది పనులు చేయగలిగిన వారి శాతం,
ప్రకటనల ఉద్దేశాన్ని గుర్తించడం: 45% నుండి 92%కి పెరిగింది.
ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రమోషన్లను అర్థం చేసుకోవడం: 39% నుండి 88%కి పెరిగింది.
సాధారణ కంటెంట్‌లా నటిస్తూ వచ్చే ప్రకటనలను గుర్తించడం: 31% నుండి 84%కి పెరిగింది.
ఆన్‌లైన్ భద్రతను అర్థం చేసుకోవడం: 45% నుండి 91%కి పెరిగింది.
ప్రకటనల వెనుక ఉన్న ఒప్పించే ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం: 36% నుండి 88%కి పెరిగింది.
 
ఈ కార్యక్రమం ఇంటరాక్టివ్ క్లాస్‌రూమ్ సెషన్ల ద్వారా విద్యార్థులు ప్రకటనలను గుర్తించేలా, సాధారణ కంటెం ట్‌కు, ప్రమోషన్లకు(ప్రకటనలకు) మధ్య గల వ్యత్యాసాన్ని గ్రహించేలా, వినియోగదారులను ఆకర్షించే వ్యూహాలను అర్థం చేసుకునేలా, బాధ్యతాయుతమైన వినియోగదారులుగా, డిజిటల్ పౌరులుగా సరైన నిర్ణయాలు తీసుకునేలా సహాయపడుతుంది. ఈ సెషన్లను ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళం, తెలుగు, గుజరాతీ, అస్సామీస్ వంటి ఎనిమిది భాషల్లో నిర్వహించారు.
 
ASCI సీఈఓ, సెక్రటరీ జనరల్ మనీషా కపూర్ మాట్లాడుతూ, నేటి కాలంలో పిల్లలు ప్రకటనలు, కంటెంట్ ఒకదానితో ఒకటి ముడిపడిపోయిన వాతావరణంలో పెరుగుతున్నారు. ఈ కార్యక్రమం ప్రభావం గణాంకాల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. క్లాస్‌రూమ్ సెషన్ల తర్వాత అన్ని పారామితులలో స్కోర్లు రెండింతల కంటే ఎక్కువయ్యాయి. ఇది విద్యార్థులలో ఎంతో అవగాహన పెరిగిందని తెలియజేస్తోంది. చాలా చిన్న వయస్సు నుంచే పిల్లలు కంటెంట్, బ్రాండ్‌లకు ఎక్కువగా గురవుతున్న నేటి ప్రపంచంలో మీడియా, ప్రకటనల అక్షరాస్యత అనేవి చాలా ముఖ్యమైన జీవిత నైపుణ్యాలు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం, వీటిని పాఠ్యప్రణాళికలో చేర్చడం జరుగుతుందని ఆశిస్తున్నాం. పది లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులకు చేరడంలో మాకు సహాయం చేసిన మా భాగస్వామ్య సంస్థ షార్ప్ ఎన్జీఓను మేం అభినందిస్తున్నాం అని అన్నారు.
 
యాడ్‌వైజ్ కార్యక్రమం వివిధ విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా రూపొందించిన లెర్నింగ్ మాడ్యూల్స్, యాక్టివిటీలు, వీడియోలు, తరగతి గది చర్చలను ఉపయోగిస్తుంది. విద్యార్థులతో పాటు, తరగతి గదికి ఆవల కూడా ఈ నిరంతర అభ్యాసానికి మద్దతుగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోసం కూడా ఈ చొరవ అవసరమైన వనరులను అందిస్తుంది. ASCI ముఖ్యంగా పిల్లలు, యువతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతమైన ప్రకటనల పద్ధతులను పాటించేలా చేయడం, వినియోగదారుల అవగాహనను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది. యాడ్‌వైజ్ ద్వారా దేశంలోని పాఠశాలల్లో ప్రకటనల అక్షరాస్యతను మరింత విస్తరించాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
About Writer
ఐవీఆర్