1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. AESL launches Aakash INVICTUS- Engineering 2.0, strengthening its JEE ecosystem with Invictus-led high-performance academic architecture

ఇన్విక్టస్- ఇంజనీరింగ్ 2.0ను ప్రారంభించిన ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్

Aakash INVICTUS- Engineering 2.0
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ ప్రవేశ పరీక్షల శిక్షణ ప్రదాతలలో ఒకటైన ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల శిక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ‘ఆకాశ్‌ ఇన్విక్టస్‌-ఇంజినీరింగ్‌ 2.0’ను ప్రారంభించింది. జెఈఈ మెయిన్, జెఈఈ అడ్వాన్స్‌డ్ మరియు రాష్ట్ర స్థాయి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(సిఈటి)లకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం పనితీరు-ఆధారిత సమగ్ర విద్యా విధానంగా ఆకాష్ ఇన్విక్టస్-ఇంజనీరింగ్ 2.0 తీర్చిదిద్దడం ద్వారా తమ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సన్నద్ధత వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించింది.
 
ఆరు ప్రధాన అంశాలతో తీర్చిదిద్దబడిన సమగ్ర శిక్షణ 
విద్యార్థులు తమ తరగతి గదిలో, తమ పుస్తకాలలో, తమ పరీక్షలలో, వారు పొందే మార్గదర్శకత్వంలో, ఇలా ప్రతి దశలోనూ ఇన్విక్టస్ వ్యత్యాసాన్ని చూస్తారు. ఈ కార్యక్రమం ఆరు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది.
 
ఫలితాలపై దృష్టి సారించిన విద్యా విధానం: ప్రతి తరగతి, సాధన, పునశ్చరణ ప్రక్రియను జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జేఈఈ మెయిన్‌, బిట్స్‌ఏటీ, రాష్ట్ర ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లో సాధ్యమైనంత ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా రూపొందించారు. 
 
ర్యాంకులు సాధించిన ఉపాధ్యాయుల బృందం: ఇన్విక్టస్‌కు అధ్యాపక బృందమే ప్రధాన బలం. ఈ విద్యా బృందమే ఇన్విక్టస్‌ పాఠ్య ప్రణాళిక, పుస్తకాలు, పరీక్షా విధానాన్ని రూపొందించింది. 
 
శాస్త్రీయంగా రూపొందించిన & పరిశోధన-ఆధారిత అధ్యయన సామగ్రి: ఈ విద్యా బృందం అభ్యసన శాస్త్రం, పరీక్షా సరళిపై లోతైన పరిశోధనలతో  పుస్తకాలను తిరిగి రాసింది. ఇది విద్యార్థులను ప్రాథమిక అంశాల నుంచి  అత్యంత కఠినమైన సమస్యల వరకు దశలవారీగా తీసుకువెళుతుంది.
 
తెలివైన పరీక్ష. లోతైన విశ్లేషణ: పరీక్షల తరచుదనం, స్థాయి, కఠినతతతో సహా పూర్తిగా పునఃరూపకల్పన చేయబడిన పరీక్షా విధానం కారణంగా ఇక్కడ నిర్వహించే ప్రతి పరీక్ష విద్యార్థికి వారి బలాలు, లోపాలు, మెరుగుపరచుకోవాల్సిన కచ్చితమైన అంశాలను గురించి స్పష్టమైన అవగాహనను కల్పిస్తుంది.
 
పారదర్శక అభివృద్ధి ప్రణాళిక: విద్యార్థి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాడు, తాను చేరుకోవాలనుకుంటున్న లక్ష్యానికి వెళ్లేందుకు అనుసరించాల్సిన మార్గం ఏమిటన్నది విద్యార్థులు, తల్లిదండ్రులు స్పష్టంగా తెలుసుకోగలరు. 
 
తరగతి గదికి మించిన మార్గదర్శకత్వం, సహాయక వ్యవస్థ: జోసా కౌన్సెలింగ్‌ మార్గదర్శకత్వం, సందేహాల నివృత్తితో పాటు నిరంతర మార్గదర్శకత్వం అందించనున్నారు. తరగతి సమయం దాటిన తర్వాత కూడా విద్యార్థికి అవసరమైన సహాయం అందేలా, ఏ విద్యార్థి వెనుకబడకుండా ఈ వ్యవస్థను రూపొందించారు.
 
జాతీయ స్థాయిలో ప్రారంభంతో ఆకాశ్‌ ఇన్విక్టస్‌ నాలుగు ప్రత్యేక బ్యాచ్‌లను కూడా పరిచయం చేస్తోంది: అవి ఏస్(Ace), ఎచీవర్( Achiever), యాక్సలేటర్(Accelerator), అపెక్స్(Apex). విద్యార్థుల అభ్యాస శైలి, వారి లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ నాలుగు బ్యాచ్‌లు సమానమైన సామర్థ్యం కలిగిన మార్గాలు. వీటన్నింటి ఉద్దేశ్యం ఒక్కటే: ప్రతి విద్యార్థి ఒత్తిడి లేకుండా తమ గరిష్ట సామర్థ్యాన్ని చేరుకునేలా చేయడం.
 
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా, ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఈఎస్‌ఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి గరిస మాట్లాడుతూ, ఆకాశ్‌ ఇన్విక్టస్‌-ఇంజినీరింగ్‌ 2.0ను ఏళ్ల తరబడి వరుసగా అగ్ర ర్యాంకులు సాధించిన అనుభవం ఉన్న మా అత్యుత్తమ ఉపాధ్యాయులు రూపొందించారు. వారు మా పాఠ్య ప్రణాళికను పునర్నిర్మించారు, పుస్తకాలను తిరిగి రాశారు, పరీక్షా విధానాన్ని పూర్తిగా కొత్తగా రూపొందించారు.
 
మేము మొదట కొన్ని ఎంపిక చేసిన కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము, జెఈఈ 2026లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం దేశంలోని ప్రతి ఆకాశ్‌ శాఖలోని ప్రతి విద్యార్థికి ఆకాశ్‌ ఇన్విక్టస్‌ను అందిస్తున్నాం. జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జేఈఈ మెయిన్‌, బిట్స్‌ఏటీ, రాష్ట్ర ఇంజినీరింగ్‌ పరీక్షల్లో మా విద్యార్థులు సాధ్యమైనంత ఉత్తమ ర్యాంకులు సాధించేందుకు ఈ వ్యవస్థ సహాయపడుతుందని మేము నమ్ముతున్నాం. అలాగే, జెఈఈ 2027, 2028 ఫలితాలు ఆకాష్ చరిత్రలోనే అత్యుత్తమంగా ఉంటాయని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే, 'అత్యుత్తమ ప్రమాణాలు కొందరికే పరిమితం ఎందుకు కావాలి?' అని అన్నారు. 
 
ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆకాశ్‌ శాఖల్లో తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ఆకాశ్‌లో చదువుతున్న విద్యార్థులను తొలుత ఇన్విక్టస్‌ విధానంలోకి తీసుకురానున్నారు. అనంతరం కొత్తగా చేరే విద్యార్థులందరూ ఇందులో భాగమవుతారు. ఈ కార్యక్రమం గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించేందుకు శాఖల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి
తర్వాతి కథనం
ఉప ఎన్నికలు : తమిళనాడులో రెండు స్థానాల్లో విజిల్ గెలుపు