ఏపీ పాలీసెట్ - 2026 పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి 93.57 శాతం ఉత్తీర్ణత
AP POLYCET Results 2026
గిరిజన జిల్లాల నుండి వచ్చిన అద్భుతమైన పనితీరు కూడా అంతే సంతోషాన్ని కలిగిస్తోందని నారా లోకేష్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు (99.11%), పోలవరం (95.46%), పార్వతీపురం మన్యం (93.45%) జిల్లాలు రాష్ట్రంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన జిల్లాల జాబితాలో నిలిచాయి.
ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1,77,581 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, ఏప్రిల్ 25, 2026న జరిగిన పరీక్షకు 1,63,008 మంది హాజరయ్యారని.. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక హాజరు అని నారా లోకేష్ పేర్కొన్నారు. వీరిలో 1,48,950 మంది అర్హత సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 91.37గా నమోదైంది.
