మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (04:40 IST)

పళనిస్వామి కాదు శశికళ బానిస: వికీపిడియాలో మారిన పేరు

ప్రజా మద్దతుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పేరు వికీపీడియాలో మారిపోయింది. పళనిస్వామి పేరును కొట్టేసి ఆ స్థానంలో ‘శశికళ బానిస’ అని రాశారు. శశికళకు వ్యతిరేకంగా పన్నీర్‌ సెల్వం గళమెత్తడంతో అన్నాడీఎంకేలో మ

ప్రజా మద్దతుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పేరు వికీపీడియాలో మారిపోయింది. పళనిస్వామి పేరును కొట్టేసి ఆ స్థానంలో ‘శశికళ బానిస’ అని రాశారు. శశికళకు వ్యతిరేకంగా పన్నీర్‌ సెల్వం గళమెత్తడంతో అన్నాడీఎంకేలో మొదలైన ఆధిపత్య పోరులో చివరికి చివరికి నాటకీయ పరిణామాల మధ్య పళనిస్వామి గద్దెనెక్కారు. సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ జైలుకు వెళ్లారు. 
 
అయితే శశికళ మద్దతుదారుడైన పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడాన్ని జీర్ణించుకోలేని కొందరు వికీపీడియాలో ఆయన పేరును శశికళ బానిస అని మార్చేసి తమ కోపాన్ని చల్లార్చుకున్నారు. ఫిబ్రవరి 16నే దీనిని ఎడిట్‌ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ పేరును సరిచేశారు.
 
పళనిస్వామి ప్రభుత్వంపై ప్రముఖ హీరో కమల్‌హాసన్‌ షాకింగ్‌ కామెంట్ చేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఏర్పాటైన ప్రభుత్వానికి, నేరగాళ్ల గ్యాంగ్‌నకు పెద్ద తేడా ఏమీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో శనివారం నాటి పరిణామాలను, సభ జరిగిన తీరును తనతో సహా ప్రజలు ఎవరూ అంగీకరించడం లేదన్నారు. జైలులో ఉన్న శశికళ ఎంచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం బాధాకరమన్నారు. తమిళ అసెంబ్లీని శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైందని, దానిని మనమే శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. తన రాజకీయ అరంగేట్రంపై మరోమారు స్పందించిన కమల్‌ తాను రాజకీయాలకు పనికిరానని స్పష్టం చేశారు.