నమ్మకం కలిగించాలి
మంచి మార్కులు వస్తేనేగానీ జీవితంలో సాఫల్యం ఉండదు అనుకునే పిల్లలకు, అలాంటి భావన తప్పు అని అర్థమయ్యేలా చెప్పడం పెద్దలుగా మీ బాధ్యత. బలవంతంగా మీ ఆశయాలను, కోరికలను వారిమీద రుద్దకూడదు. వారి శ్రమను పొగిడి, వారి మనోబలాన్ని రెట్టింపు చేయాలేగానీ నిరుత్సాహ పర్చకూడదు.

