పెద్దయ్యాక ఏమవుతారు..?
పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నావు..? ఇది పిల్లల్ని మనం అడిగే అతి సాధారణ ప్రశ్న. ఏ డాక్టరో, టీచరో, ఇంజనీరో అవుతామని వారు, ఆ వయసుకి తగిన రీతిలో సమాధానం చెబుతారు. కానీ అలా అనుకున్నది అవ్వాలంటే కెరీర్ ప్లానింగ్ అవసరమని పిల్లలకు ఆ వయసులో తెలియక పోవచ్చు. కానీ పెద్దవారికి తెలిసుండాలి.
ఏ కెరీర్ ఎంచుకోవాల్నా చాలా మంది శిక్షణా కార్యక్రమాలు, సర్టిఫికెట్లు సంపాదించటంపైనే శ్రద్ధ పెడతారు. అవన్నీ అవసరమే అయినప్పటికీ, మీకు ఆసక్తి ఉన్న రంగం ఏదో తెలిశాకే ఆ రంగంలో ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కెరీర్ డెవలప్మెంట్ ప్లాన్ ఉన్నప్పుడే ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడతాయన్నది గ్రహించాలి.
ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశాలేంటంటే... పని స్వభావం, గుర్తింపు, భద్రత, ఆదాయం, కుటుంబ జీవితం ఎదుగుదలకు ఉండే అవకాశాలు మొదలైనవన్నీ చూసి... ఆ రకంగా పిల్లలకు సరైన గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.