ఒయిస్టర్ చికెన్ సాస్
కావలసిన పదార్థాలు :
కోడి మాంసం - అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు, సోయా సాస్ - రెండు టీస్పూన్లు, మిరియాల పొడి - ఒక టీస్పూన్, ఒయిస్టర్ సాస్ - టేబుల్ స్పూన్, నూనె - తగినంత.
గ్రేవీ తయారీ కోసం :
క్యాప్సికమ్ - ఒకటి, పచ్చిమిర్చి - నాలుగు (చీల్చినవి), వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, స్ప్రింగ్ ఉల్లిపాయలు - నాలుగు, ఆయిస్టర్ సాస్ - రెండు టీస్పూన్లు, కార్న్ ఫ్లోర్ - టీస్పూన్.
తయారు చేయు విధానం :
కోడి మాంసాన్ని శుభ్రంగా కడిగి రెండు సెంటీ మీటర్ల పొడవుతో ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. దీనికి సోయా సాస్, ఆయ్‌స్టర్ సాస్, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడిలను కలిపి 20 నిముషాల పాటు ఉంచాలి.
బాణాలిలో నూనె వేసి కాగాక అందులో చికెన్ ముక్కలను వేసి బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో వైపు బాణాలిలో ఇంకాస్త నూనె వేసి కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లిలను వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి చదరాకారంలో కోసి పెట్టుకున్న క్యాప్సికమ్‌ను వేసి వేయించాలి.
ఇందులో ఓయిస్టర్ సాస్‌ను వేసి కాసేపు వేయించాక అందులో వేయించి పెట్టుకున్న కోడి మాంసపు ముక్కలను వేయాలి. ఇందులో ఉల్లిముక్కలను కూడా వేసి వేయించాలి. కార్న్ ఫ్లోర్‌లో నీళ్లు పోసి కలిపి చికెన్ ముక్కల మిశ్రమంలో వేయాలి. నిముషం పాటు ఉడికించి దించి సర్వ్ చేయాలి.
గమనిక : సాస్‌లోనే ఉప్పు ఉంటుంది కనుక విడిగా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు.