1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

చైనీస్ చికెన్ రోల్

చికెన్ వంద గ్రాములు క్యారెట్ పావు కప్పు క్యాప్సికమ్ రెండు టేబుల్ స్పూన్లు క్యాబేజీ - అర కప్పు
కావలసిన పదార్థాలు :
చికెన్ - వంద గ్రాములు, క్యారెట్ - పావు కప్పు, క్యాప్సికమ్ - రెండు టేబుల్ స్పూన్లు, క్యాబేజీ - అర కప్పు, సోయా సాస్ - రెండు చెంచాలు, వైట్ పెప్పర్ - టీ స్పూన్, ఉప్పు - తగినంత, స్ప్రింగ్ ఆనియన్ - రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి - రెండు రెబ్బలు, బటర్ - ఒక టీస్పూన్, పంచదార - అర టీస్పూన్.

తయారు చేయు విధానం :
ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కూరలను కూడా తురుముకోవాలి. ఓ ప్యాన్‌లో బటర్ వేసి కరిగాక పంచదార, వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలను వేసి వేగాక, కూరల తురుము, సోయా సాస్, ఉప్పు, వైట్ పెప్పర్‌లను వేసి రెండు, మూడు నిమిషాల పాటు వేయించాలి. దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి.

మైదా, ఉప్పులను వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దీనిని చపాతీలా పెద్దగా, చతురాకారంలో ఒత్తుకోవాలి. ఎన్ని కావాలో అన్ని ఈ తరహాలోనే ఒత్తుకోవాలి. వీటిని పెనంపై కాస్త వేడి చేసి ఆరబెట్టాలి. దీనిలో చికెన్ మిశ్రమాన్ని పెట్టి రెండువైపులా మూసి రోల్‌లాగా చేయాలి. దీనిని బాణాలిలో కాగిన నూనెలో వేసి వేయించి తీయాలి. వేడివేడిగా సర్వ్ చేయాలి.
About Writer
WD