1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

వెజ్‌ఫ్రై తయారీ విధానం

వెజ్‌ఫ్రై బంగాళాదుంప మునక్కాయ నూనె ఉప్పు పంచదార
తీసుకోవలసిన పదార్ధాలు: బంగాళాదుంపలు - అర్ధకప్పు, మునక్కాయలు - అర్ధకప్పు (చిన్నవిగా కట్ చేసుకోవాలి, వంకాయలు - అర్ధకప్పు (పొడవుగా కట్ చేసుకోవాలి), నూనె - నాలుగు చెంచాలు, ఉప్పు, పంచదార - సరిడేంత. రుబ్బుకోవలసిన పదార్ధాలు - పెద్ద ఉల్లిపాయలు - రెండు, అల్లం - రెండు ముక్కలు, చింతపండు - రెండు నిమ్మకాయలంత, ఎండుమిరపకాయలు - పదిహేను, పచ్చికొబ్బరి తురుము - అర్ధకప్పు, గరం మసాలా - ఒక స్పూను.

ఇలా తయారు చేయండి: ముందుగా బాండలిలో నూనె పోసి అది కాగిన తర్వాత అన్ని కూరలను (పచ్చివి) వేసి సన్నని మంటపై వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో ఇప్పటికే మనం సిద్ధంగా ఉంచుకున్న మసాలా ముద్ద వేసి ఒక కప్పు నీళ్లు పోసి ముక్కలను బాగా ఉడికించాలి.

ఇలా ముక్కలు మెత్తబడే వరకు ఉడికిన తర్వాత సన్నని మంటపై అందులో పంచదార, ఉప్పు వేసి మళ్లీ ఉడికించాలి. దీన్ని గ్రేవీలా వచ్చే వరకు ఉంచాలి. అది గ్రేవీలా తయారైన తర్వాత చివరగా కరివేపాకు చల్లేసి దించితే వేడివేడి వెజ్‌ఫ్రై రెడీ..
About Writer
Hanumantha Reddy