1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్

సెజ్‌వాన్ రైస్

మందంతో కూడిన అడుగు గల పాత్రను తీసుకుని అందులో బటర్‌ను కరిగించండి
Schezwan Rice

కావలసినపదార్థాలు:
బాస్మతీ రైస్: రెండు కప్పులు
ఉప్పు: తగినంత
బటర్: ఒక టేబుల్ స్పూన్
వెల్లుల్లి: ముక్కలు ఒక టీ స్పూన్
పచ్చిమిర్చితరుగు: అర కప్పు
క్యారెట్, బీన్స్ వివిధ వెజిటబుల్స్ తరుగులు: చెరో కప్
సోయాసాస్: ఒక టేబుల్ స్పూన్
వెనిగర్: ఒక టేబుల్ స్పూన్
అల్లం: ఒక పెద్ద ముక్క
వెల్లుల్లి: రెబ్బలు పది
ఎండు మిరపకాయలు: ఆరులేక ఎనిమిది

తయారీ విధానం:
మందంతో కూడిన అడుగు గల పాత్రను తీసుకుని అందులో బటర్‌ను కరిగించండి. ఇందులో వెల్లుల్లి ముక్కలను, బాస్మతి రైస్‌ను వేసి రెండు గ్లాసుల నీటితో ఉడికించండి. రైస్‌లో ఒకస్పూన్ ఉప్పును చేర్చండి. మరో బాణలిలో నూనె పోసి తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించండి. తర్వాత అల్లం పేస్ట్ ఎండుమిరపకాయలు, సాస్ వెనిగర్, ఉప్పు, వెజిటబుల్స్‌ను అందులో కలిపి దించేయండి. ఉడికిన రైస్‌‌ను ఓ ప్లేట్‌లో తీసుకుని రైస్ మీద వెజిటబుల్ మిక్స్‌ను వేసి బాగా కలపండి. సేజ్ వాన్ రైస్ రెడీ... ఈ రైస్‌కు చైనీస్ స్వీట్ అండ్ సార్ గ్రేవీతోనూ, టమోటా సాస్, చిల్లీ సాస్, మంజూరీ గ్రేవీలను సైడిష్‌గా వాడుకోవచ్చు.
About Writer
WD