సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. తారల ఫోటో గ్యాలెరీ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 29 జులై 2022 (23:01 IST)

హయతీ అలా ఎక్కి కూర్చుంటే తట్టుకోగలమా... ఎవరు?

Dimple Hayati
ఇదివరకు ఐటమ్ సాంగ్స్ కోసం అంటూ తారలు వుండేవారు. ఇప్పుడు హీరోయిన్లే ఐటమ్ గర్ల్స్‌గా మారిపోయి గ్లామర్ షో చేసేస్తున్నారు. అదేమని అడిగితే ఆల్ రౌండర్‌గా వుంటేనే ఛాన్సులు వస్తాయాయే మరి అంటున్నారు ఈ ముద్దుగుమ్మలు.

 
Dimple Hayati
తాజాగా తెలుగు అమ్మాయి డింపుల్ హయతి ఫోటో షూట్ కోసం ఇచ్చిన ఫోటోలు హీటెక్కిస్తున్నాయి. బండిపై ఎక్కి కూర్చుని ఫోజిలిచ్చింది ఈ భామ. అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్. అంత పెద్దబండి మీద కూర్చుని అలా గ్లామర్ ఒలకబోస్తే ఇంకేమన్నా వుందా అని ఆమె అభిమానులు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 
Dimple Hayati
సినిమా అంటేనే అందాల ప్రపంచం కనుక ఆమాత్రం గ్లామర్ ఆరబోయడం తప్పదని చెపుతోందట ఈ ముద్దుగుమ్మ. ఐతే... ప్రస్తుతం ఆమె చేతిలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రం చేతిలో వుంది. మరి ఈ గ్లామర్ షో చూసిన తర్వాతయినా ఛాన్సులు తన్నుకుంటూ వస్తాయేమో చూడాలి.