చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను?
* కూరల్లోగాని, పప్పులోగాని ఉప్పు ఎక్కువయినపుడు కాస్త నిమ్మరసం పిండాలి.
* గోధుమలు పిండి పట్టించే ముందు శుభ్రంగా కడిగి ఎండబోసి పట్టిస్తే పిండి మెత్తగా ఉంటుంది. ఆ పిండితో చేసిన రొట్టెలు ఎంతో మృదువుగా ఉంటాయి.
* గారెల పిండిలో, పులిసిన పెరుగు ఒక కప్పు, లేదా రెండు చెంచాల మైదా వేశారంటే గారెలు మృదువుగా, టేస్టీగా ఉంటాయి.
* గులాబ్ జాం తయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీరు కలపండి. అవి మృదువుగా రుచిగా ఉంటాయి.
* గులాబ్ జాంలు చేసే సమయంలో కాసిన్ని జీడిపప్పు పొడిని ఉండలకు కలిపారంటే, అవి మృదువుగా ఉంటాయి. మంచి రుచిగా ఉంటాయి.
* చింతపండు పచ్చడికి కాస్త బెల్లం, కాసిని టమోటాలు కలిపారంటే, చింతపండు చట్నీ రుచే వేరుగా ఉంటుంది.
* చపాతీ పిండిని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళు లేదా కాస్త నూనె కలిపి గంటపాటు నానబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి.
* చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు మృదువుగా ఎక్కువసేపు ఉంటాయి.
* చపాతీలు వత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనెవేసి మడతలతో చేసి హాట్ ప్యాక్‌లో ఉంచితే ఆరేడుగంటలపాటు మెత్తగా ఉంటాయి.
* టమోటా చారు పొయ్యిమీద నుంచి దింపేటప్పుడు కాస్త నిమ్మరసం పిండండి. అది మాంచి రుచిగా ఉంటుంది.