పాలు కల్తీవేనని కనిపెట్టడం ఎలా..?
నేటి తరుణంలో కల్తీ పదార్థాలు ఎక్కువై పోతున్నాయి. అవి కల్తీవేనని ఎలా తెలుసుకోవాలని బాధపడుతున్నారా... వద్దు వద్దూ ఈ కింది చిట్కాలు పాటించి చూడండి.. చాలు..
1. ఆకుకూరలను రెండు నిమిషాల పాటు మరుగుతున్న నీటిలో ఉంచాలి. ఆ తరువాత నీటితో శుభ్రంగా కడిగి నీరు లేకుండా వంపేసి.. ఫ్రిజ్‌లో ఉంచితే.. దాదాపు రెండు వారాల పాటు నిల్వ ఉంటాయి.
2. బెండకాయ కూర వండేటప్పుడు జిగురు కారణంగా కూర అంటుకుపోతూ ఉంటే.. ఆ కూరలో కొంచెం పెరుగు కలిగి వండితే ముక్కలు అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి.
3. బంగాళాదుంపలు ఉడికించిన నీటిని పారబోయకుండా.. చపాతీ పిండి కలిపేటప్పుడు నీటికి బదులుగా వాటిని వాడుకోవచ్చు. ఇలా చేయడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు వృధా కాకుండా కాపాడుతున్నవారవుతారు.
4. అరటి పూసలోని పీచు తీసేయాలంటే.. పూసను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కొంచెం మజ్జిగ జిలకరిస్తే పీచు కవ్వంతో తేలికగా వచ్చేస్తుంది. పెరుగులో చిన్న పచ్చి కొబ్బరి ముక్కను వేస్తే పులవకుండా ఉంటుంది.
5. పిండి కలిపిన పాలు మరీ చిక్కగా ఉంటాయి. ఈ కల్తీని కనిపెట్టాలంటే.. చెంచా పాలలో.. ఇంట్లో ఉండే టించర్ అయోడిస్‌ను రెండు చుక్కలు వేసి చూడండి.. పాలు గనుక ఊదారంగులోని మారినట్లయితే ఆ పాలు కల్తీవన్నమాట.