బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (13:26 IST)

ఈశాన్యంలో దేవుని మందిరాలు నిర్మిస్తే..?

ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశవైపున చూడడం వలన కుబేరస్థానాన్ని చూసినట్లవుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైతే ఈ విధంగా చూస్తారో ఆ ఇంట్లో ధనానికి ఇబ్బంది ఉండదంటున్నారు. పడక నుండి నిద్రలేవగానే తూర్పుదిశగా నడిస్తే మంచిదని.. దీని వలన ఈ రోజు చేయాలనుకున్న పనులు ఆటంకాలు లేకుండా జరుగుతాయని వారు చెప్తున్నారు.
 
లెట్రిల్‌లో దక్షిణాభిముఖంగా గానీ, ఉత్తరాభిముఖంగా గానీ కూర్చోవాలని, తూర్పు, పడమరలకు అభిముఖంగా కూర్చోకూడదని వాస్తు చెబుతోంది. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యంలో ప్రారంభించి నైరుతి వైపునకు చెత్తను పోగుచేయాలి. ఆగ్నేయమూల వంట చేయునప్పుడు.. తూర్పు అభిముఖంగా నిలిచి వంట చేయాలి.

ఇంటిని చిమ్మే చీపురు శని ఆయుధమని, అతని చేతిలో చీపురు ఎత్తిపట్టుకొనబడి ఉంటుందని.. అందువలన మనం చీపురును గోడకు ఆనించేటప్పుడు చీపురు పట్టుకునే భాగాన్ని పైకి మాత్రమే నిలబెట్టి ఉండడం శుభప్రదమని వాస్తు శాస్త్రం తెలుపుతోంది.
 
ఈశాన్యంలో దేవుని మందిరాలు నిర్మించి పూజ చేయరాదని.. ఇలా చేయడం వలన ఈశాన్యం మూతపడడం జరుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. తూర్పు గోడలోనే దేవుని గూడును ఏర్పాటు చేసుకోవడం క్షేమదాయకమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.