శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:00 IST)

ఇంటి స్థలాలు కొంటున్నారా.. జాగ్రత్త...?

ఇంటి స్థలం కొనేముందు ఆ స్థలం చతురస్రాకారంగా లేదా దీర్ఘచతురస్ర ఆకారంగా ఉండా అనే విషయం గమనించండి. అలానే ఏవైనా మూలలు పెరిగి ఉన్నాయా అనే విషయాన్ని కూడా గమనించండి. ముందుగా స్థలం 90 శాతం సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. విదిక్కు స్థలం అయినచో తప్పనిసరిగా వాస్తు సిద్ధాంతిని తీసుకెళ్లి ఆ స్థలం మీకు కలిగి వస్తుందో లేదా చూపించుకోవాలి.
 
మీరు కొనబోయే స్థలం ఏది ఏమైనా ఈశాన్య భాగం తెంపు పడరాదు. అనగా ఈశాన్యం కోతకలిగి ఉండరాదు. ఇంకా మీరు కొనబోయే స్థలం తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, ఉత్తర వాయవ్యం పెరిగి ఉండరాదు. ఇలా ఉన్న స్థలాలు కొనరాదని పండితులు చెబుతున్నారు. అలానే ఉత్తరభాగం, తూర్పు భాగం కోతపడిన స్థలాలను కొనడం కూడా మంచిది కాదు.