సంబంధిత వార్తలు
#CoronavirusStrain యూకే నుంచి భారత్‌కు కరోనా 2.O.. ఢిల్లీ మీదుగా చెన్నైకి..!?
corona virus
దేశంలో కొత్త వైరస్ అడుగుపెట్టినా సరే మన దేశం అప్రమత్తంగా ఉందని భారత వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. యుకె నుంచి వచ్చే విమానాలను మన దేశం సహా చాలా దేశాలు నిషేధించాయి. విమాన ప్రయాణ నిషేధం డిసెంబర్ 31 న రాత్రి 23:59 వరకు ఉంటుంది. అన్ని యుకె విమానాల సస్పెన్షన్ మంగళవారం రాత్రి నుండి ప్రారంభమవుతుంది.
దీనికి కరోనా స్ట్రెయిన్‌గా పేరుపెట్టారు. దక్షిణాఫ్రికా సహా చాలా దేశాల్లో ఇది అడుగుపెట్టింది. ఇక అక్కడి ప్రజల్లో కూడా ఒకరకమైన భయం అనేది మొదలయింది. ఈ నేపథ్యంలో యుకెలో లాక్ డౌన్ విధించారు. అక్కడ నాలుగో లాక్ డౌన్‌ని అమలు చేస్తున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం కొత్త వేరియంట్ 70 శాతం ఎక్కువ వేగంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఇది ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్‌తో కట్టడి అవుతుందని భావిస్తున్నారు.
