శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (13:45 IST)

భారత్‌లో కరోనా తగ్గుముఖం.. కోటి 75వేల మార్కు దాటిన కోవిడ్

భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కేసుల సంఖ్య కోటి 75 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,556 కేసులు నమోదు కాగా, 301 మంది ప్రాణాలు విడిచారు. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 30,376 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.
 
దేశంలో మొత్తం 1,00,75,116 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,92,518 ఉండగా, 96,36,487 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,46,111 మంది కరోనా వ్యాధితో మరణించారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 95.65 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.45 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 2.90 శాతంగా ఉంది.