తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు.. 20వేల పోస్టుల భర్తీ
తెలంగాణలో ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగ ఖాళీలున్నాయి. వివిధ శాఖల్లో సుమారు 45 వేలు, సంస్థల్లో 20 వేలు భర్తీ చేయాల్సి ఉందని ముఖ్యకార్యదర్శులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో నాలుగో తరగతి ఉద్యోగుల వివరాలు ఉన్నట్టు తెలిపారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సంఖ్యను విడిగా పొందుపరిచారు. ఆ ప్రకారం పోలీసు, విద్య, వైద్యఆరోగ్య శాఖలలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి.
పాఠశాల విద్యాశాఖలో 9,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేక గ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్‌జీటీ) 5,800, స్కూలు అసిస్టెంట్లు 2,500, భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు 300, మోడల్ పాఠశాలల ఉపాధ్యాయుల పోస్టులు 1000 ఉన్నాయి. ఇవిగాక ఉన్నతవిద్య, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాశాఖల పోస్టులు మరో మూడు వేల వరకు ఉన్నాయి.