తెలంగాణాలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 592 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,81,414కు చేరాయి. కొత్తగా 643 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 2,73,013 మంది డిశ్చార్జి అయ్యారు. మరో ముగ్గురు మహమ్మారికి బలవగా మొత్తం మృతుల సంఖ్య 1513కు పెరిగింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 6,888 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 4719 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది. అలాగే రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53 శాతంగా ఉందని, రికవరీ రేటు 97.01 శాతానికి చేరిందని వివరించింది.
శనివారం ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 41,970 శాంపిల్స్ పరీక్షించామని, ఇప్పటివరకు 64,43,052 నమూనాలను పరిశీలించినట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 119, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 70, రంగారెడ్డిలో 57 నమోదయ్యాయి.