సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2020 (18:56 IST)

పదో తరగతి విద్యార్థులు 13మందికి కరోనా.. ఏపీలో కోవిడ్ అప్డేట్

రుద్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పదో తరగతి విద్యార్థులకు 13 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారంపాటు స్కూలుకు సెలవులు ప్రకటించారు. మరోవైపు రుద్రవరం కేజీబీవీలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు కూడా పాజిటివ్ రావడంతో హోంఐసోలేషన్‌కు తరలించారు. అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది స్కూలు పరిసరాలతో పాటు గ్రామం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లి కాలనీలను శానిటైజ్ చేశారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 62,215 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 479 కొత్త కేసులు నమోదు కాగా.. ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,78,285కి చేరింది. 
 
తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 7,074 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 497 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,66,856కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,355 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,11,96,574 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.