సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (07:48 IST)

22-12-2020 మంగళవారం దినఫలాలు - కుబేరుడుని ఆరాధించడం వల్ల...

మేషం : ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. నిరుద్యోగులకు ఆశాజనకం. ప్రముఖుల కలయిక మీకెంతో ఉపకరిస్తుంది. గృహంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. 
 
వృషభం : చేపట్టిన పనులు కొంత మందు వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. స్త్రీలు విలువైన వస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో విజయం సాధిస్తారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. 
 
మిథునం : స్త్రీలకు ఆరోగ్య, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఇరుగు, పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. 
 
కర్కాటకం : వృత్తిపరంగా ఎదురైన ఆటంకాలను అధికమిస్తారు. హోటల్, కేటరింగ్ పనివారలకు ఆశాజనకం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారితో చికాకులు తప్పవు. ప్రయాణాల్లోనూ, వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. మీ ఆశయ సిద్ధికి నిరంతర కృషి పట్టుదల ముఖ్యమని గమనించండి. 
 
సింహం : ఆదాయ, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ఇతరులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. పైనాస్, చిట్‌ఫండ్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. 
 
కన్య : రావలసిన ధనంలో కొంత మొత్తం చేతికందుతుంది. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రింటింగ్ రంగాల వారికి శ్రమించిన కొలది ఆదాయం అన్నట్టుగా ఉంటుంది. స్త్రీలు కొన్ని విషయాలను పట్టించుకోకపోవడం శ్రేయస్కరం. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
తుల : ఉద్యోగస్తులు పెండింగ్ పనులను తోటివారి సాయంతో పూర్తి చేయగలుగుతారు. బంధువులను కలుసుకుంటారు. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికంగా ఉంటుంది. 
 
వృశ్చికం : ప్రేవైటు సంస్థలోని వారి సమర్థతకు గుర్తింపు లేకపోగా మాటలు పడవలసి వస్తుంది. స్త్రీలు ధనం బాగా ఖర్చు చేస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. 
 
ధనస్సు : ఆర్థిక లావాదేవీలు, చర్చలు అనుకున్నంత చురుకుగా సాగవు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రయాణాలు అనుకూలం. దంపతుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. ఎప్పటి సమస్యలు అపుడే పరిష్కరించుకోవడం మంచిది. ఇతరులను వాహనం అడిగి భంగపాటుకు గురవుతారు. 
 
మకరం : వృత్తి ఉద్యోగాల్లో ఏ మార్పు లేకపోవడంతో అశాంతికి లోనవుతారు. మీ ఔన్నత్యాన్ని ఎదుటివారు గుర్తించారు. ఆలయాలను సందర్శిస్తారు. పత్రికా సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం శ్రేయస్కరం. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
కుంభం : విద్యార్థినులకు సహచరుల తీరు ఆందోళన కలిగిస్తుంది. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. కుంటుబ, ఆర్థిక సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలచుకుంటారు. నూతు పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. 
 
మీనం : వృత్తి ఉద్యోగాలు సమాన్యంగా సాగుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు తప్పవు. ఉన్నతస్థాయి అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రుణం కొంత మొత్తం చెల్లించి రుణదాతలను సంతృప్తిపరుస్తారు.