సంబంధిత వార్తలు
- కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన అమెరికా
- రెడ్ జోన్లలో కఠిన నిబంధలు.. పక్కింటికి కూడా వెళ్లడానికి వీల్లేదు..
- అదుపులోకిరాని కరోనా... శ్రీవారి దర్శనం ఇప్పట్లే లేనట్టే...
- 40 మంది NRIలను మింగేసిన కరోనా వైరస్, యూఎస్‌లో భయంభయంగా ఎన్నారైలు
- కరోనావైరస్: లాక్ డౌన్ ఎత్తేస్తే పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది - ప్రపంచ దేశాలకు WHO హెచ్చరిక
కరోనా రోగుల్లో వైరస్ రీ యాక్టివేట్?
కరోనా వైరస్ బారినపడి విముక్తి పొందిన వారిలో మళ్లీ ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా సౌత్ కొరియాలో 91 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. అయితే, నిపుణులు మాత్రం ఒకసారి సోకిన తర్వాత మళ్లీ సోకడం అసాధ్యమని అంటున్నారు.
నిజానికి కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న రోగులకు మళ్లీ వైరస్ సోకుతుందా? అంటే ఇప్పటి వరకు ఎవరూ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కానీ, తాజాగా దక్షిణ కొరియాలో వైరస్ బారినపడి కోలుకున్న 91 మందికి పరీక్షలు చేస్తే మళ్లీ పాజిటివ్‌గా తేలింది.
వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిన వారిలో 91 మందికి పరీక్షలు చేస్తే మళ్లీ పాజిటివ్ వచ్చిందని దక్షిణ కొరియా 'వ్యాధుల నియంత్రణ, నిరోధక కేంద్రాలు (కేసీడీసీ)' డైరెక్టర్ జియాన్ కయాంగ్ వెల్లడించారు.
దీంతో ఈ రోగులందరినీ ఆస్పత్రుల్లో చేర్చి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోగుల్లో వైరస్ మళ్లీ క్రియాశీలమైందా (రీయాక్టివేట్) లేక మళ్లీ సోకిందా (రీఇన్‌ఫెక్షన్) అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
