1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Rain Threat for Vizag Second ODI

విశాఖపట్టణం వన్డే మ్యాచ్‌కు వరుణ గండం

vizag cricket stadium
స్వదేశంలో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. శుక్రవారం రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులోభాగంగా భారత్ వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. రెండో వన్డే మ్యాచ్‌ విశాఖపట్టణంలో జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచివుంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు విశాఖలో డే అండ్ నైట్ మ్యాచ్ జరుగనుండగా టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో వర్షాలు పడుతుండగా రేపు విశాఖలోనూ వరుణి ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 
 
దాంతో ఈ మ్యాచ్ జరగడంపై సందిగ్ధత నెలకొంది. నిన్న ముంబైలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గడం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
విశాఖపట్టణంలో దంచికొడుతున్న వర్షం - రెండో వన్డే నిర్వహణ సందేహమే?