1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. What an Idea, Axar Patel wonderful catch, viral video

Axar Patel అద్భుత క్యాచ్, నీకు ఆ ఐడియా ఎలా వచ్చిందిరా నాయనా? వీడియో వైరల్

Axar Patel wonderful catch
అక్సర్ పటేల్ (Axar Patel) ఆ అద్భుతమైన క్యాచ్ పట్టకపోయినట్లయితే ఇండియా పరాజయం ఖరారైపోయేదే. ఇంగ్లాండ్ బ్యాట్సమన్ విల్ జాక్స్ అత్యంత దూకుడుగా ఆడుతున్నాడు. అప్పటికే రెండు 6లు నాలుగు 4లు కొట్టి అత్యంత ప్రమాదకరంగా మారిపోయాడు. ఆ పరిస్థితుల్లో ఆర్షదీప్ సింగ్ వేసిన బంతిని జాక్స్ బౌండరీకి తరలించాడు. అక్కడే అద్భుతం జరిగింది. బౌండరీ లైన్ వైపు పరుగులు పెడుతూ అక్సర్ పటేల్ వచ్చాడు. క్యాచ్ పట్టాడు. ఐతే క్యాచ్ పట్టాక కంట్రోల్ తప్పి లైన్ దాటేస్తానని తెలిసి వెంటనే ఆ బంతిని శివమ్ దూబే వైపు విసిరాడు. వెంటనే ఆ బంతిని దూబె పట్టేసాడు. ఇలాంటి అద్భుతమైన క్యాచ్ కారణంగా జాక్స్ అవుటయ్యాడు. కానీ ఇంగ్లాండ్ బ్యాట్సమన్లు లక్ష్య ఛేదనకు గాను చేసిన వీరోచితమైన బ్యాటింగ్ పట్ల క్రీడాభిమానులంతా ఫిదా అవుతున్నారు.
 
అభిషేక్ ఫైనల్లో విజృంభిస్తాడు
టీమిండియా క్రికెటర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్‌లో వరుసగా వైఫల్యం చెందుతున్నారు. దీనిపై మరో ఓపెనర్ సంజూ శాంసన్ స్పందించాడు. అభిషేక్ శర్మను తక్కువ అంచనా వేయొద్దని హితవు పలికాడు. ఫైనల్ మ్యాచ్‌లో విజృంభించే అవకాశాలు లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌లో ప్రతి క్రికెటర్ ఫామ్ కోల్పోవడం సాధారణమేనన్నాడు. కానీ, తనదైన రోజున అభిషేక్‌ విజృంభిస్తాడని, అది వరల్డ్ కప్ ఫైనల్స్‌ అవుతుందేమో ఎవరికి తెలుసన్నాడు. 
 
మా డ్రెస్సింగ్‌ రూమ్ వాతావరణం బాగుంటుంది. మాకు అభిషేక్‌ శర్మ మీద విపరీతమైన నమ్మకం ఉంది. మేమంతా అతడికి మద్దతుగా నిలుస్తున్నాం. ప్రతి క్రికెటర్‌ కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఈ ఫార్మాట్లో ఒకటి, రెండు మంచి షాట్లు కొడితే.. అంతా కుదురుకుంటుంది. మాకు అతడి మీద ఇంకా నమ్మకముంది. తనదైన రోజున అతడు విధ్వంసం సృష్టిస్తాడు. ఎవరికి తెలుసు.. అది టీ20 ప్రపంచకప్‌ ఫైనలే అవుతుందేమో అని సంజు శాంసన్ అన్నాడు. 
 
అలాగే అతడు న్యూజిలాండ్‌ సిరీస్‌లో తన వైఫల్యం గురించి కూడా మాట్లాడాడు. నాకు అది చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఖచ్చితంగా ఫామ్ అందిపుచ్చుకొని మళ్లీ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకున్నాను. నిజానికి నేను న్యూజిలాండ్‌ సిరీస్‌లో కాస్త ఎక్కువ ప్రయత్నించాననిపించింది. టీ20 క్రికెట్ చాలా విచిత్రమైంది. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైనవారు సైతం ఈ ఫార్మాట్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు అని సంజు శాంసన్‌ పేర్కొన్నాడు
తర్వాతి కథనం
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న జస్ప్రీత్ బుమ్రా