1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ashok Galla and Sri Gouri Priya’s film 'VISA – Vintara Saradaga' – release date fixed.

VISA :అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ చిత్రం VISA – వింటారా సరదాగా. డేట్ ఫిక్స్

Ashok Galla and Sri Gouri Priya’s film VISA
Ashok Galla and Sri Gouri Priya’s film VISA
హీరో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘VISA – వింటారా సరదాగా’ ప్రపంచవ్యాప్తంగా జనవరి 1, 2027న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రేమ, స్నేహం, సరదా, యువత జీవితంలోని అనుభవాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ చిత్రం న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది.
 
 
ఉద్భవ్ రఘు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెరికా నేపథ్యంలో సాగుతుంది. ఉన్నతమైన కలలను సాకారం చేసుకోవాలనే ఆశయంతో స్వదేశాన్ని విడిచి అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థుల జీవితాల చుట్టూ కథనం సాగుతుంది. విదేశాల్లో విద్యార్థుల జీవనశైలి, స్నేహాలు, ప్రేమలు, అనుకోని సంఘటనలు, ఎదురయ్యే ఆసక్తికరమైన పరిస్థితులను వినోదాత్మకంగా ఈ సినిమాలో ఆవిష్కరించారు.
 
ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. యూత్‌ఫుల్ కథాంశం, వినోదభరితమైన సన్నివేశాలు, అశోక్ గల్లా – శ్రీ గౌరీ ప్రియ జంట మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
 
సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ‘అనగా అనగా అమెరికా’, ‘చింగారి’ పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సంజిత్ హెగ్డే ఆలపించిన ‘అనగా అనగా అమెరికా’ పాట అమెరికాలో హీరోహీరోయిన్ల ప్రయాణంలోని ప్రేమ, కొత్తదనం, ఆహ్లాదకరమైన భావాలను ఆవిష్కరిస్తే, సిద్ శ్రీరామ్, లిప్సిక ఆలపించిన ‘చింగారి’ పాట ప్రేమలోని మధురమైన అనుభూతులను పలికించింది. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి చక్కటి సంగీతాన్ని అందించారు.
 
ఈ చిత్రంలో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటించగా, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వివా హర్ష, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఎస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్, ఫ్రెండ్‌షిప్, ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిన ‘VISA – వింటారా సరదాగా’ 2027 నూతన సంవత్సరాన్ని థియేటర్లలో మరింత సందడిగా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
గర్భం దాల్చిన తొలి మూడు నెలలు చాలా కష్టంగా ఉంటుంది : కియారా అద్వానీ