చెన్నై మైలాపూరులో పట్టపగలే హత్య.. అడ్డంగా నరికేశారు.. కూల్‌గా వెళ్లిపోయారు..
Updated: Wed, 28 Oct 2026 (12:09 IST)
చెన్నై మైలాపూరులో పట్టపగలు ఓ హత్య జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మైలాపూర్‌కు చెందిన, నేర చరిత్ర ఉన్న మైత్రేయన్, అక్టోబర్ 27న ఉదయం 11 గంటల ప్రాంతంలో బెయిల్ షరతుపై పోలీస్ స్టేషన్‌లో సంతకం చేసి వెళ్తుండగా, అడయార్‌లోని ఒక వాటర్ ట్యాంక్ సమీపంలో దుండగులు అతని ఆటోరిక్షాను అడ్డగించారు. అతను పారిపోతుండగా వెంబడించి, కుప్పకూలే వరకు పదేపదే కత్తితో పొడిచారు. ఈ ఘటనకు అనంతరం మైత్రేయన్‌ను ఆసుపత్రిలో చేర్చారు. కానీ కొద్దిసేపటికే అతను మరణించాడు.
పట్టణ భద్రతా భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా జీవ, సూర్య, విఘ్నేష్ అనే 19 ఏళ్ల ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ దాడికి పాత కక్షలే కారణమని వారు భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia....
మరింత చదవండి