1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Husband commits suicide because wife did not cook chicken curry

భార్య చికెన్ కూర వండలేదని భర్త ఆత్మహత్య

Husband
కోడి కూర చేసేందుకు భార్య నిరాకరించిందన్న ఆగ్రహంతో ఓ ఆటో రిక్షా డ్రైవర్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్‌లో ఎం. రతన్‌లాల్‌ (32) శనివారం సాయంత్రం పని ముగించుకుని వచ్చి సమీపంలోని చికెన్ షాపులో చికెన్ కొని కూర వండాలని భార్యకు చెప్పాడు.

 
అయితే కుమార్తెకు చికెన్ గున్యా సోకిందని, ఇంట్లో మాంసాహారం వండనని భార్య చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన రతన్ లాల్ ఇంట్లో వున్న పురుగుల మందు విషాన్ని తాగాడు.

 
భర్త పురుగులు మందు తాగాడన్న విషయాన్ని తెలుసుకున్న భార్య తన ఇంటి పొరుగువారికి, బంధువులకు సమాచారం అందించింది. వారు రతన్ లాల్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పేలుతున్న జోకులు, మీమ్స్