శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (16:35 IST)

తండ్రి కాబోతున్న దిల్ రాజు.. తేజస్విని నిండు గర్భిణి?

Dil Raju
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తండ్రి కాబోతున్నారు. మొదటి భార్య అనారోగ్యం కారణంగా  మృతి చెందడంతో తేజస్విని అలియాస్ వైగా రెడ్డి అనే యువతిని దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజస్విని గర్భవతి అని తెలిసింది. త్వరలోనే దిల్ రాజు దంపతులు తల్లిదండ్రులు కానున్నారని టాక్ వస్తోంది. 
 
ఈ కారణంగా దిల్ రాజు ఎక్కువగా ఆమెతోనే గడుపుతున్నారు. సినిమాల నిర్మాణ పనులను ఆయన కజిన్ శిరీష్‌తో పాటు రాజు కుమార్తె హన్షితారెడ్డి, రాజు సోదరుని కుమారుడు హర్షిత్‌రెడ్డి చూసుకుంటున్నారు. 
 
దిల్ రాజు ప్రస్తుతం రామ్‌చరణ్‌-శంకర్ కాంబినేషన్‌లో తమ బ్యానర్ 50వ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వీటితో పాటు ఎఫ్‌3, జెర్సీ హిందీ రీమేక్‌, హిట్ హిందీ రీమేక్‌, శాకుంతలం, విజయ్‌-వంశీ పైడిపల్లి కాంబినేషన్ మూవీని తెరకెక్కిస్తున్నారు.