ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: బుధవారం, 16 మార్చి 2022 (21:31 IST)

హాయిగా సాగిపోతున్న కాపురంలో చిచ్చుపెట్టిన అక్రమ సంబంధం

సాఫీగా సాగిపోతున్న కుటుంబమది. ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు వారికి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆ కుటుంబమంటే అక్కడున్న వారికి ఎంతో గౌరవం. వివాదాలకు దూరంగా ఉంటూ వస్తోంది ఆ కుటుంబం. ఆ ఏరియాలో అసలు వాళ్ళు ఉన్నారా అన్న అనుమానం చాలామందికి కలుగకమానదు. అంత సైలెంట్‌గా ఉండేవారు. అలాంటి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసాడు మరిది.

 
చెన్నైలోని బ్రాడ్‌వే దగ్గరున్న బుద్దిసాహేబ్ స్ట్రీట్‌లో అబ్దుల్ రెహమాన్ అలియాస్ రెహమాన్ అనే వ్యక్తి యాస్మిన్లు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెహమాన్‌కు బంధువులు ఎక్కువ. ఇంటికి వచ్చే బంధువులను బాగా చూసుకునేవాడు రెహమాన్ అతని భార్య. ఈ క్రమంలో మరిది రసూల్ యాస్మిన్‌కు దగ్గరయ్యాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు.

 
స్వర్గపు అంచుల వరకు వెళ్దాం అన్నాడు. నీ భర్తకు తెలియకుండా ఇద్దరు కలవచ్చని చెప్పాడు. దీంతో యాస్మిన్ నమ్మింది. నెల రోజుల పాటు అతన్ని కలిసింది. శారీరకంగా ఇద్దరూ ఒకటయ్యారు. అయితే ఈ విషయం భర్తకు తెలిసింది. పద్ధతి మార్చుకోమన్నాడు, పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టాడు. అయినా భార్యలో మార్పు రాలేదు.

 
చీటికీమాటికీ రసూల్ దగ్గరకు వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఇక సహనం కోల్పోయిన రెహమాన్, భార్యను చంపేశాడు. తన పిల్లలు ఎక్కడ అనాధలు అయిపోతారన్న భయంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల విచారణలో హత్యగా తేలడంతో రెహమాన్ కటకటాలపాలయ్యాడు. ప్రశాంతంగా సాగిపోతున్న కుటుంబం చిన్నాభిన్నం కావడంతో స్థానికులందరూ చర్చించుకుంటున్నారు.