Hyderabad: కుమారుడి సాయంతో ప్రియుడిని హత్య చేసింది
అక్రమ సంబంధాలతో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. హైదరాబాద్‌లోని చింతల్, అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఒక వివాహిత మహిళ, తన కుమారుడి సహాయంతో తన ప్రియుడిని హత్య చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన 40 ఏళ్ల శివారెడ్డి, గత పదేళ్లుగా సదరు మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు.
ఆ మహిళ కుమారుడు (19 ఏళ్లు) కూడా వారితో పాటే నివసిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా, శివారెడ్డి ఆ ఇద్దరినీ వేధిస్తున్నాడు. ఆదివారం రాత్రి, ఆ మహిళ, ఆమె కుమారుడు కలిసి శివారెడ్డిని నరికి చంపారు.
అనంతరం, వారు మృతదేహాన్ని ఒక గోనెసంచిలో మూటగట్టి, దానిని తరలించడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆ మహిళను, ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
