1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. UP shocker: Groom shot dead by bride’s relative on way to wedding

పెళ్లి ఊరేగింపులో వరుడిపై కాల్పులు జరిపిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?

Wedding
ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి వేడుకకు వెళ్తున్న 27 ఏళ్ల వరుడిని, వధువు బంధువు కాల్చి చంపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం బీబీపూర్ గ్రామం సమీపంలో జరిగింది. మృతుడిని ఆజాద్ బింద్‌గా గుర్తించారు. అతను బదౌర్ గ్రామానికి చెందినవాడు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) కున్వర్ అనుపమ్ సింగ్ ప్రకారం, ఆ ప్రాంతం నుండి కాల్పుల శబ్దంపై అత్యవసర కాల్ రావడంతో, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
 
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, వరుడి ఊరేగింపు వధువు గ్రామం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితులు బిబిపూర్ గ్రామం సమీపంలో ఊరేగింపును అడ్డుకుని, వరుడిపై కాల్పులు జరపడం ప్రారంభించారు.
 
పోలీసుల వివరాల ప్రకారం, వధువు బంధువైన ప్రదీప్ బింద్ అనే వ్యక్తికి ఈ వివాహం పట్ల అసంతృప్తి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రదీప్, రవి యాదవ్‌తో కలిసి ఒక మోటార్‌సైకిల్‌పై అక్కడికి చేరుకుని, ఆజాద్ బింద్‌పై కాల్పులు జరిపారు. ఆజాద్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
చెల్లి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన అన్నయ్య