సంబంధిత వార్తలు
- పట్టపగలు నడిరోడ్డుపై భార్యను చంపుతుంటే చూస్తూనే వెళ్లిన జనం
- అన్నయ్యనా.. బావగారా? పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పోస్ట్
- దేశం, మతం, వయసు సాకుగా చూపి విష ప్రచారం చేస్తున్నారు.. విడాకులపై ప్రియాంకా కామెంట్స్
- ఘజియాబాద్‌లో దారుణం.. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ..
- భార్యతో ప్రాణ స్నేహితుడి అఫైర్.. ఇంటికి భోజనానికి పిలిచి కాల్చిపారేశాడు..
రోకలిబండతో తలపై మోదీ భర్తను హత్య చేసిన భార్య.. ఇంటి ముందే...?
వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
అనంతపురం జిల్లా, పటాచెరువు గ్రామంలో మూడు నెలల క్రితమే.. రోకలిబండతో తలపై మోదీ భర్తను హత్య చేసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అనంతపురం పోలీస్ స్టేషన్‌లో నిందితురాలు లొంగిపోయింది.
వివరాల్లోకి వెళితే.... కల్యాణదుర్గం మండలం, పాతచెరువు గ్రామానికి చెందిన హనుమంతు సుకన్య భార్యాభర్తలు. మద్యానికి బానిసైన హనుమంతుని భార్య గొడవపడింది.
అంతేగాకుండా ఆవేశంలో సుకన్య భర్తమీద కోపంతో రోకలిబండతో హనుమంతుపై దాడి చేసింది. ఒక వైపు కూతురు వారిస్తున్నప్పటికీ వినకుండా హనుమంతును రోకలిబండతో కొట్టడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
ఆపై భర్త మృతదేహాన్ని ఇంటి ముందు గొయ్యి తీసి పాతిపెట్టింది. ఈ విషయాన్ని తల్లి కోసం కూతురు ఎవరికీ చెప్పకుండా వుండిపోయింది.
అయితే తల్లీకూతుళ్ల మధ్య జరిగిన గొడవలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని హనుమంతు శవాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు పంపించారు.
