ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : ఆదివారం, 28 మే 2017 (10:33 IST)

చేయడంలో వీక్.. చూడటంలో ఫస్ట్... శృంగారంలో 'హై'దరాబాద్

ప్రపంచంలో శృంగారాన్ని మనసారా ఆస్వాదించే టాప్‌-100 నగరాల్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని భాగ్యనగరానికి చోటుదక్కింది. ప్రేమకు, రొమాన్స్‌కు రాజధానిగా పేరొందిన పారిస్‌ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుం

ప్రపంచంలో శృంగారాన్ని మనసారా ఆస్వాదించే టాప్‌-100 నగరాల్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని భాగ్యనగరానికి చోటుదక్కింది. ప్రేమకు, రొమాన్స్‌కు రాజధానిగా పేరొందిన పారిస్‌ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. ప్రపంచంలో శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించే పట్టణాలు, నగరాలు ఏవనే అంశంపై ‘ద మోస్ట్‌ సెక్స్‌ పాజిటివ్‌ సిటీస్‌ ఇన్‌ ద వరల్డ్‌’ పేరుతో అడల్డ్‌ యాప్‌ లజీవా నిర్వహించిన ఆసక్తికరమైన అధ్యయనంలో తేలింది. మొత్తం 200 పట్టణాల్లో ఈ అధ్యయనం నిర్వహించి టాప్‌ 100 పట్టణాలను ప్రకటించగా.. భారతకు చెందిన ఐదు నగరాలు ఆ జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి.
 
శృంగారంలో పాల్గొనడం, శృంగారంలో ప్రయోగాలు, శృంగారంలో సంతృప్తి, సెక్స్‌ టాయ్స్‌ వినియోగం, శృంగార వీడియోలు, శృంగార సాహిత్య వినియోగం, శృంగార వినోదం (అడల్డ్‌ ఎంటర్‌టైనమెంట్‌), భాగస్వామిని పంచుకోవడం (స్వింగర్స్‌), గర్భనిరోధకాల వినియోగం, స్వలింగ సంపర్కంపై ఆసక్తి, శృంగారంలో స్త్రీపురుష సమానత్వం వంటి పది అంశాలపై ఆ సంస్థ సమాచారం సేకరించి ర్యాంకులు కేటాయించింది.
 
ఈ జాబితాలో టాప్‌ టెన్ ర్యాంకులు సాధించిన భారతదేశ నగరాల్లో 71వ ర్యాంకు సాధించిన ముంబై అగ్రస్థానంలో నిలవగా.. ఢిల్లీ 78వ ర్యాంకుతో రెండో స్థానం దక్కించుకుంది. హైదరాబాద్‌ 89 ర్యాంకుతో మూడవ స్థానంలో నిలిచింది. కోల్‌కతా, చెన్నై మన వెనకాలే 90, 91 ర్యాంకులతో సరిపెట్టుకున్నాయి. 
 
శృంగారంలో ఆసక్తిగా పాల్గొనే విషయంలో ముంబై 10కి 6.2 స్కోర్‌తో అగ్రస్థానంలో ఉండగా, కోల్‌కతా 5.4, చెన్నై 4.5, ఢిల్లీ 3.3 స్కోర్‌ సాధించాయి. హైదరాబాద్‌ 1.9 స్కోర్‌తో అట్టడుగు స్థానంలో ఉంది. కానీ, శృంగారంలో పాల్గొనే విషయంలో అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్‌ పోర్న్‌ మూవీస్ చూడటంలో మాత్రం టాప్‌లో ఉంది. పదికి 8.7 స్కోరుతో.. చెన్నై (8.5), ముంబై (8.2), ఢిల్లీ (7.7), కోల్‌కతా (7.4)లను వెనక్కి నెట్టింది.
 
శృంగారంలో ఆసక్తిగా పాల్గొనకపోయినా పాల్గొన్నప్పుడు సంతృప్తి పొందడంలో మాత్రం హైదరాబాదీలు పదికి 3.5 స్కోర్‌తో మిగతా నగరాల కంటే ముందున్నారు. ఈ విషయంలో చెన్నై 1.1 స్కోర్‌తో అట్టడుగు స్థానంలో ఉంది. సెక్స్‌ టాయ్స్‌ వినియోగంలో పదికి 5.3 స్కోర్‌తో ఢిల్లీ టాప్‌లో ఉండగా.. ముంబై 5.1, చెన్నై4.8, హైదరాబాద్‌ 4.5, కోల్‌కత్తా 4.1 స్కోర్‌ దక్కించుకున్నాయి. పోర్న్‌ మూవీస్ కోసం నెట్‌లో శోధించేటపుడు ఈ 5 నగరాల వాసులు దేనికోసం వెతుకుతారో తెలుసా? ముంబైవాసులు ‘భాభీ’ అనే పదంతో, ఢిల్లీవారు ‘వైఫ్‌’ పదంతో, హైదరాబాదీలు ‘కాలేజ్‌ గర్ల్స్‌’, కోల్‌కతావాసులు ‘బెంగాలీ’, చెన్నైవాసులు ‘తమిళ్‌’ పదాలతో సెర్చ్‌ చేస్తారని ఈ సర్వేలో ద్వారా తేలింది.