శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2016 (14:36 IST)

జగన్‌కు-పవన్‌కు ఆవేశం ఎక్కువా? ప్రజలు వీరిని నమ్మట్లేదా? హోదా పరిస్థితేంటి?

తెలంగాణ ఉద్యమాన్ని జేఏసీ, తెరాస అధినేత కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరామ్‌, ప్రజలందరూ ఏకమై పోరాడి సఫలం చేసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా ఉద్యమం నీరుకారిపోయింది. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ప్రకటి

తెలంగాణ ఉద్యమాన్ని జేఏసీ, తెరాస అధినేత కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరామ్‌, ప్రజలందరూ ఏకమై పోరాడి సఫలం చేసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా ఉద్యమం నీరుకారిపోయింది. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ప్రకటించడంతో ఏపీ సీఎం చంద్రబాబు కాంప్రమైజ్ అయిపోయారు. రాత్రికి రాత్రే కేంద్రానికి ధన్యవాదాలు చెప్పేందుకు ప్రెస్ మీట్‌లు పెట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా ఫోన్‌లో థ్యాంక్స్ చెప్పారు. 
 
అంతటితో ఆగకుండా వచ్చేవారం ఢిల్లీకి వచ్చి స్వయంగా కలుస్తానని చెప్పేశారు. ఇదంతా వెంట వెంటనే జరిగిపోయాయి. కానీ ప్రత్యేక హోదాపై పోరాటం చేసే సత్తా ఉన్న నాయకుడు లేడంటూ చర్చ సాగుతోంది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని చెప్తున్న నాయకుల్లో ఆవేశమే ఎక్కువుంది కానీ.. వారిని ప్రజలు ఏమాత్రం నమ్మట్లేదు. వీరిలో జగన్, కాంగ్రెస్, శివాజీ, పవన్ కళ్యాణ్… వంటి ఇంకా కొంతమంది కూడా చెప్పవచ్చు. 
 
వీరంతా ఉద్యమాన్ని నడిపించి ప్రత్యేక హోదాను సాధించేలా కనిపించట్లేదు. అప్పడప్పుడూ మీడియా ముందుకు వచ్చి నాలుగు మాటలు మాట్లాడటం, కొందరు బహిరంగ సభలు పెట్టి ఆవేశంగా ప్రసంగించడంతో సరిపెట్టుకుంటున్నారు. ఉద్యమాన్ని నడిపించి తద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. ప్రత్యేక హోదా సాధించిపెట్టే సీన్ వీరికి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈసారి సీమాంధ్ర ప్రజలు మోసపోయి వీరి మాయలో పడలేదు. ప్రజలు కోపంగా ఉండటంతో పాటు బీజేపీ, టీడీపీలను తిట్లు తిట్టేస్తున్నారు. ప్యాకేజీకి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేస్తున్నారు. ఇంకా ఏవో కేంద్రాన్ని నాలుగు తిట్లు తిట్టేసి.. రాజకీయ పార్టీల వల్ల కాకపోతే మేమొస్తామని చెప్పిన వారిని కూడా ప్రజలు నమ్మట్లేదు.
 
ఉద్యమాన్ని కార్యచరణ ప్రకారం నడిపి ప్రత్యేక హోదా సాధించే వారు ఏపీలో లేరని ప్రజలు ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు మిత్రపక్షంలో ఉండటంతో పాటు డబ్బులొస్తే చాలు అభివృద్ధి చేసేస్తాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ప్రత్యేక హోదాను పార్లమెంట్‌లో లేవనెత్తిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా మాటెత్తడం లేదు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా గోవిందా..!