శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శుక్రవారం, 2 డిశెంబరు 2016 (22:49 IST)

సామాన్య జనం నెత్తిపైన మోదిన మోది... ఉగ్రవాదులు, నకిలీరాయుళ్లు దర్జాగా మార్చేసుకున్నారా?

నల్లధనాన్ని పెద్దనోట్ల రద్దుతో వల వేసి లాగాలనుకున్న నరేంద్ర మోదీ సర్కారుకు షాక్ కొట్టేసినట్లయింది. ఆర్బీఐ గణాంకాలను బట్టి నల్లధనం ఒక్క రూపాయి కూడా లేదు. అంతా తెల్లధనంగా మారిపోయినట్లు లెక్కలను బట్టి అర్థమవుతుంది. ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం నవంబ

నల్లధనాన్ని పెద్దనోట్ల రద్దుతో వల వేసి లాగాలనుకున్న నరేంద్ర మోదీ సర్కారుకు షాక్ కొట్టేసినట్లయింది. ఆర్బీఐ గణాంకాలను బట్టి నల్లధనం ఒక్క రూపాయి కూడా లేదు. అంతా తెల్లధనంగా మారిపోయినట్లు లెక్కలను బట్టి అర్థమవుతుంది. ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం నవంబరు 8కి ముందు రూ. 15, 56, 900 కోట్లు మార్కెట్లో చలామణిలో ఉన్నాయనీ, అవన్నీ రద్దు చేసినట్లు చెప్పారు. అంటే ఇందులోనే బ్లాక్ మనీ కూడా ఉన్నదన్నమాట. 
 
ఐతే నోట్లు రద్దు చేశాక చూసుకుంటే మరో 25 రోజులు పాత నోట్ల డిపాజిట్‌కు సమయం ఉండగానే రూ. 11 లక్షల కోట్లు డిపాజిట్ అయిపోయాయి. మరో 20 రోజుల్లో ఆర్బీఐ అనుకున్న డబ్బును మించి డిపాజిట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీన్నిబట్టి చూస్తే నకిలీ నోట్లు కూడా బ్యాంకుల్లో జమ అయిపోయి ఎంచక్కా మంచి నోట్లు నల్లబాబులకు చేరిపోయాయి. నల్లబాబులే కాకుండా ఉగ్రవాదులు కూడా కరెన్సీని వివిధ మార్గాల్లో పొందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
దెబ్బ మాత్రం సామాన్యుడి నెత్తిపైన పడింది. నోట్ల రద్దు చేసి 20 రోజులైనా జనం ఏటీఎం సెంటర్ల ముందు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. అనేక కోణాల్లో ఆర్థిక స్థితి కుదేలైంది. మోదీ ప్లాన్ తప్పిందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివాలా తీసినంత పని జరుగుతోంది. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. చిల్లర వర్తకం నాశనమైంది. స్టాక్ మార్కెట్లో ఎఫ్ డిఐలు తరళి వెళ్లిపోతున్నాయి. విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నాయి. అనేక ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగుల ఉద్యోగాలు ఊడాయ్. ఇలా అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది దేశం. నోట్ల రద్దు బూమరాంగ్ అవ్వడమే కాదు దేశ ప్రజలను తీవ్రమైన ఇక్కట్లకు గురిచేసింది. దేశంలో 75 లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉందని అంచనా. అదంతా ఎలా వస్తుందో మరి?