ప్రపంచంలో ఏ దేశంలో జీవించే ప్రజలైనా వారి దేశాన్ని, మాది అమెరికా మాత, ఆస్ట్రేలియా మాత, మలేషియా మాత అనరు. కానీ భారతదేశంలో జీవించే ప్రతి ఒక్కరూ భరతమాత అని పిలుస్తారు. పుట్టినగడ్డను తల్లితో సమానంగా గౌరవించే సంస్కారం కలిగిన దేశం భారతదేశం.
మీరు కోతులను పూజిస్తారు. పామును పూజిస్తారు. చెట్టును పూజిస్తారు.... అని విదేశీయులు మన భారతీయులను ఎగతాళి చేస్తారు. జంతువులను, చెట్లనే కాదు, చివరికి చలనము లేని భూమిని, కొండలను కూడా పూజిస్తాము. అంటే ప్రకృతిలోని ప్రాణమున్న జీవిని, ప్రాణము లేని వస్తువుని, మానవుడు జీవించడానికి సహాయపడే పంచ భూతములను సమానంగా గౌరవించి పూజించే సంస్కారం కలిగిన దేశము మనది. అందుకనే మనదేశంలో ప్రజలు ధర్మంగాను, విచక్షణా జ్ఞానంగాను, బంధుత్వాలను నిలబెట్టుకుంటూ జీవిస్తున్నారు. స్త్రీలకు మన దేశంలో ఇచ్చినంత గౌరవము గాని, ప్రాముఖ్యతగాని ఇతర దేశాలలో వుండదు. ఇష్టపడి కలిసి ఉన్నంతవరకు భార్యాభర్తలు, విడిపోతే ఒక ఆడ, మగ అనే సాంప్రదాయము మనది కాదు. వివాహము అయిన తర్వాత వారి మధ్య కలిగిన భార్యాభర్తల సంబంధము వారి చివరి ఊపిరి ఉన్నంతవరకు అలాగే వుంటుంది.
ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ మతానికి సంబంధించినవారైనా మనుష్యులు అంతా ఒక్కటే. మతాలు వేరైనా, కులాలు వేరైనా మమతానురాగాలు ఒక్కటే. భావాలు ఒక్కటే. కొడుకు పుడితే ఆనందిస్తారు. కుటుంబంలోని సభ్యుడు చనిపోతే దుఃఖిస్తారు. ఏ దేశంలో కూడా వారి కుటుంబ సభ్యుడు చనిపోతే నవ్వే సంస్కారం లేదు. మతం అనేది ఒక జీవన విధానము. ఎవరి మతాన్ని వాళ్లు గౌరవించడం వాళ్ళ ధర్మము. కొన్ని ఇతర మతాలను ద్వేషించడం ధర్మము కాదు. అయితే ఇతర దేశాలకు మన భారతదేశానికి తేడా ఏమిటి?
ఇతర దేశాలలో వారివారి దేశాలలో స్థిరపడిన మతాల ప్రభావము ఎక్కువగా ఉంటుంది. అక్కడ నివసిస్తున్న వాళ్ళందరూ ఆ దేశపు మతానికి సంబంధించిన ఆచారాలు పాటించాల్సిందే. ఇతర భాషలకు స్వేచ్ఛ వున్నా ఒక స్థాయి వరకే పరిమితమై వుంటుంది. కానీ, మన భారతదేశంలో అన్ని మతాల వారికి స్వేచ్ఛ వుంది. ఆ మతాలపైన ప్రజలకు గౌరవం ఉంది. మన దేశంలో పుట్టి, పెరిగిన ఏ మతంవారైనా ఏ కులంవారైనా అందరకూ కలిసిమెలిసి జీవించే గొప్ప గుణం కలిగినవాళ్ళు. ఇతర మతాలకు సంబంధించిన దేశాలలో పొరుగు దేశాలకు సంబంధించిన మతస్థులకే స్వేచ్ఛ లేదు. కాని భారతదేశంలో అతి తక్కువ జనాభా వున్నప్పటికీ, ఇతర మతాలవారికి న్యాయస్థానంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. వారి ఇష్టానుసారం వారి దేవుళ్లను కొలుచుకోవచ్చు. వారి పండుగలు జరుపుకోవచ్చు. ఇలా భారతమాత ఒడిలో పెరిగిన ప్రతి ఒక్కరు అన్నదమ్ములుగా జీవిస్తున్నా కొన్నిచెడు శక్తులు మన భారతదేశంలో మత కల్లోలాలు సృష్టిస్తున్నాయి. మొదటిది ఇతర దేశాల నుండి వచ్చి ఇక్కడున్న ఇతర మతాలవాళ్లని ప్రేరేపించి విధ్వంసాలు సృష్టిస్తున్నాయి.
రెండవది మనదేశంలోనే హిందువులుగా పుట్టి, పెరిగి మన మతాన్నే ద్వేషించే వాళ్ళు లేక కించపరిచే రాజకీయ వేత్తలు. ఇప్పటివరకు మన చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ముస్లింలుగాని, క్రైస్తవులుగాని హిందువులకు వ్యతిరేకంగా అల్లర్లు చేసిన సంఘటనలు చాలా తక్కువ. హిందువులకు కష్టం కలిగితే ఆదుకున్న ముస్లింలు, క్రైస్తవులు ఎంతోమంది వున్నారు. అలాగే వాళ్లకు కష్టం వచ్చినప్పుడు ఆదుకున్న హిందువులు ఎంతోమంది వున్నారు. ఇక్కడ మతాలకన్నా మానవత్వంతో జీవించేవాళ్లు ఎక్కువ. బాబ్రీ మసీదు పగులగొట్టిన సంఘటనలో జరిగిన ఘర్షణల్లో హిందువులను ముస్లింలు, అలాగే ముస్లింలను హిందువులు ఎంతోమంది వాళ్ళ ఇళ్ళలో ఉంచుకుని భోజనం పెట్టిన సంఘటనలు ఎన్నో వున్నాయి. 80 శాతం హిందువులు వున్న దేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి పదవిలో జాకీర్ హుస్సేన్, అబ్దుల్ కలాం గారిని ఎన్నుకున్న విశాల హృదయం కలిగినవారు భారతీయులు.
మతాలకు, కులాలకు అతీతంగా ఎంతోమంది కళాకారులను, క్రీడాకారులను, రాజకీయవేత్తలను గౌరవిస్తున్న దేశం మన భారతదేశం. ఎన్నో మానవతా విలువలు, సంప్రదాయాలు కలిగిన మన భారతదేశంలో కొంతమంది స్వార్థపరులు, అధికార వాంఛ కలిగిన రాజకీయ వేత్తల వలన నేను హిందువు అని చెప్పుకోవడానికి భయం కలుగుతున్నది. నేను ముస్లింని, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకునే ధైర్యము, స్వేచ్ఛ వాళ్ళకున్నా నేను హిందువుని అని చెప్పుకునే ధైర్యం మన హిందువుకి మన భారతదేశంలో లేకుండా పోతున్నది అంటే కేవలం కొంతమంది రాజకీయ ప్రముఖుల వలనే అని బల్లగుద్ధి చెప్పవచ్చు.
నేను హిందువుని అని చెప్పుకుంటే వద్దని ఏ ఇతర మతస్థుడు మనల్ని ఆజ్ఞాపించడం లేదు. కానీ రాజకీయ సభలలో, టీవీ డిబేట్స్‌లో మన హిందు రాజకీయవేత్తలు తప్పుబడుతున్నారు. పైగా మన దేశం సెక్యులర్ దేశం అనే పదాన్ని వాడుతున్నారు. అసలు సెక్యులరిజం అంటే మన మతాన్ని కించపరుచుకుంటూ, ద్వేషించుకుంటూ ఇతర మతాలకు విలువను, గౌరవాన్ని ఇవ్వడమా లేక మన మతంతో పాటు అన్ని మతాలను గౌరవించడమా అన్న విషయం కూడా తెలియని రాజకీయవేత్తలు మనకు ఉండడం దురదృష్టకరం. ఇప్పటివరకు మన టి.వి ఛానళ్లలో మన హిందువులను గాని, హిందుతత్వాన్నిగాని విమర్శించే రాజకీయవేత్తలో ఒక్కరు కూడా ముస్లింలు క్రైస్తవులు కానీ లేరు.
అంతర్జాతీయ టెర్రరిజం కన్నా మనలోనే వుండి మన దేశాన్ని మన మతాన్ని విమర్శించేవాళ్ళ వలన మనకు ఎక్కువ అపాయం కలుగవచ్చు. రాజకీయ లబ్ది కొరకు, మతాలను, కులాలను రెచ్చగొట్టి, ఓటు సంపాదించుకుని అధికారంలోకి రావాలనుకునే వ్యక్తుల వలన మన భారతమాత సిగ్గుపడాల్సి వస్తున్నది. ఖడ్గం అనే చిత్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి అన్నదమ్ములలాగా జీవించే సన్నివేశాలను ఎంతో చక్కగా చిత్రీకరించారు. అందులో నేను ముస్లింని.. కానీ భారతీయుడుని, ఇది నా దేశం, నేను భారతదేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. చివరికి ముస్లిం అయినా సరే, నా దేశానికి చెడు చేసినవాడు నా తమ్ముడైనా వాడిని చంపేయడం ధర్మం అని చెప్పే పాత్రలో ఎంతో దేశభక్తి కనబడుతుంది. అలాంటి మన భారతదేశంలో ఇతర మతాలకు, మనం ఇచ్చిన స్వేచ్ఛ ఎంత అని అంటే...
మన దేశంలో దాదాపు 3 లక్షల మసీదులున్నాయట. ఏ దేశంలోనూ ఇన్ని మసీదులు లేవట. అమెరికాలోని వాషింగ్టన్‌లో 24 చర్చిలున్నాయట. అండన్‌లో 71, ఇటలీలలోని మిలాన్‌నగరంలో 68 చర్చిలు ఉన్నాయి. కానీ మనదేశ రాజధానియైన ఢిల్లీలో మాత్రమే 271 చర్చిలున్నాయట. అలాగే ఏ ముస్లిం సంఘాలను మన దేశంలో పుట్టిన ముస్లిం విమర్శించడు. కాని కొన్ని వేలమంది హిందువులు మన హిందుత్వాన్ని కాపాడే సంస్థలను విమర్శిస్తారు. ఏ ముస్లిం, క్రైస్తవుడు హిందూ పండుగలైన దీపావళి, సంక్రాంతి, వినాయక చవితి జరుపుకోరు. కానీ హిందువులు చాలామంది రంజాన్ పండుగ నాడు విందు జరుపుకోవడం చూస్తూ వుంటాం. హిందువుల టోపీ పెట్టుకుని మసీదులకు వెళ్ళడం మనం చూస్తూ వుంటాం. కానీ ఏ ఇతర మతస్థులు తిలకం పెట్టుకుని హిందూ దేవాలయాలకు వెళ్లడం చూశామా? ఇది హిందువుల సహనానికి, సెక్యులరిజనానికి నిదర్శనం. ఈ రోజు ప్రపంచంలోని ఎన్నో దేశాలు భారత సంప్రదాయాలను, కట్టుబాట్లను, ఆచారాలను మెచ్చుకుంటున్నారు. ఎంతోమంది విదేశీయులు వాళ్ల వేషభాషలను మార్చుకుని ఇస్కాన్‌లో చేరుతున్నారు. జర్మనీలో భారతదేశ వేదాలపై, ఉపనిషత్తులపై ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. - (ఇంకా వుంది)
- ఆర్.బి