శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (18:42 IST)

1984లో ఎంజీఆర్‌.. 2016లో జయలలిత.. మారని సెంటిమెంట్... పాలనే కాదు.. మృత్యువులోనూ...

ఎంజీఆర్‌ తరహాలోనే జయ ఎంజీఆర్‌ మాదిరే సీఎం జయలలిత జ్వరంతో బాధపడుతూ 2016 సెప్టెంబరు 22వ తేదీ రాత్రి 10.30కు గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశ, అవయవాల ఇన్ఫెక్షన్‌ నియంత్రణలో నిపుణుడిగా పేరుగాంచిన లండనకు చెందిన డాక్టర్‌ జాన రిచర్డ్‌ బ

ఎంజీఆర్‌ తరహాలోనే జయ ఎంజీఆర్‌ మాదిరే సీఎం జయలలిత జ్వరంతో బాధపడుతూ 2016 సెప్టెంబరు 22వ తేదీ రాత్రి 10.30కు గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశ, అవయవాల ఇన్ఫెక్షన్‌ నియంత్రణలో నిపుణుడిగా పేరుగాంచిన లండనకు చెందిన డాక్టర్‌ జాన రిచర్డ్‌ బీలే సెప్టెంబర్‌ 30న అపోలోకు వచ్చి జయకు చికిత్స అందిస్తున్న వైద్యులతో భేటీ అయ్యారు. వారి చికిత్సలను తెలుసుకొని అదనంగా 12 పరీక్షలు చేయించారు. 
 
జయలలితను రాష్ట్ర గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగరరావు అక్టోబరు 1న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అక్టోబరు 7న జయలలితను పరామర్శించారు. సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంజీఆర్‌ను రాహుల్‌ నాయనమ్మ, నాటి ప్రధాని ఇందిర పరామర్శించడం గమన్హాం. నాడు ఇందిరకు.. నేడు రాహుల్‌కు అపోలో ఛైర్మన్‌ ప్రతాప్‌.సి.రెడ్డి దగ్గరుండి ఇద్దరు సీఎంల ఆరోగ్య పరిస్థితిని వివరించడం యాదృచ్ఛికమే. 
 
అలా గత 75 రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చిన జయలలిత.. ఆదివారం సాయంత్రం వచ్చిన గుండెపోటుతో తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. నాడు ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటూ డిసెంబరు నెలలోనే కన్నుమూయగా, నేడు జయలలిత అదే పదవిలో ఉంటూ డిసెంబరు నెలలోనే శాశ్వతనిద్రలోకి జారుకోవడం గమనార్హం.