మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (19:12 IST)

మోగుతున్న నారా బ్రహ్మణి పేరు... ఎన్టీఆర్ ఛరిష్మాతో 2019 ఎన్నికలకు రెడీ...?

రాజకీయాలు అంటే మామూలు విషయం కాదు. ప్రత్యర్థులను నిలువరిస్తూనే ప్రజల్లో ఆకర్షణ కూడగట్టుకోవాలి. ప్రజలకు ఇష్టమైన పనులు చేస్తూ ప్రజారంజక నాయకుడిగా ఎదగాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. దీనికి వ్యక్తిత్వం ఒక్కటే

రాజకీయాలు అంటే మామూలు విషయం కాదు. ప్రత్యర్థులను నిలువరిస్తూనే ప్రజల్లో ఆకర్షణ కూడగట్టుకోవాలి. ప్రజలకు ఇష్టమైన పనులు చేస్తూ ప్రజారంజక నాయకుడిగా ఎదగాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. దీనికి వ్యక్తిత్వం ఒక్కటే సరిపోదు... సమయస్ఫూర్తి, ప్రజల సమస్యలపై అవగాహన... ఇలా అనేక అంశాలపై పూర్తిస్థాయిలో అవలోకనం చేసిన అనుభవం ఉండాలి. ఈ విషయంలో నారావారి కోడలు, యువరత్న బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణికి కావలసినంత అనుభవం ఉన్నదనే చెప్పుకోవచ్చు. 
 
ఎందుకంటే ఇప్పటికే ఆమె పలు సామాజిక కార్యక్రమాలు చేయడంతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టురుగా కంపెనీని లాభాల బాటలో పయనింపజేయడమే కాకుండా పనిచేసే వారందరితో మన్ననలు పొందుతున్నారు. తన తాతయ్య ఎన్టీఆర్ ఛరిష్మా ఆమెకు ఉన్నదనేది ఆమె సన్నిహితులు చెప్పే మాట. ఇదే ఇప్పుడు ఆమె 2019 ఎన్నికల రాజకీయ తెరంగేట్రానికి బాటలు వేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో నారా బ్రహ్మణిని హిందూపూర్ లేదా గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీకి నిలబెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. నారా బ్రహ్మణి రాజకీయాల్లోనూ రాణించగలరని అనేందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. 
 
ఆమె విద్యాభ్యాసం గురించి ఒక్కసారి చూస్తే... కేలిఫోర్నియాలోని శాంతాక్లారా యూనివర్శిటీ నుంచి ఆమె ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివారు. పరీక్షల్లో టాపర్‌గా నిలిచారు. దాంతో ఆమెకు ప్రఖ్యాత యూనివర్శిటీల నుంచి ఎంబీఎ అడ్మిషన్ కోసం ఆహ్వానాలు అందాయి. హార్వర్డ్, వార్టన్, కెల్లాంగ్, స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలు ఆమెకు అడ్మిషన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఐతే ఆమె స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో చేరి ఎంబీఎ పూర్తి చేశారు. ఇలా ఆమె విద్యాభ్యాసం సమయంలోనే తన మేధస్సును చూపించారు. ఇక ప్రజా సేవలోనూ ఆమె తనదైన ముద్ర వేయగలరన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.