శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శనివారం, 24 జూన్ 2017 (15:29 IST)

జాతీయ పతాకానికి లోకేష్ గౌరవ వందనం... రోజా 'పప్పు' మాటలే నిజమంటూ...(వీడియో)

ఎమ్మెల్యే, నటి రోజా ఆమధ్య చాలాసార్లు మంత్రి నారా లోకేష్‌ను పప్పు అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఇప్పుడు మరోసారి అదే పదాలతో నెటిజన్లు నారా లోకేష్ ఇటీవల జాతీయ పతాకానికి వందనం చేయకపోవడంపై ఉపయోగిస్తున్నారు.

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ జాతీయ పతాకానికి అందరూ సెల్యూట్ చేస్తూ గౌరవ వందనం చేశారు. కానీ మంత్రి నారా లోకేష్ మాత్రం అలా చూస్తుండిపోయారు. దీనిపై మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. 
 
మంత్రి నారా లోకేష్ అలా ఎందుకు మౌనంగా వున్నారంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ఎమ్మెల్యే రోజా చెప్పినట్లే ఆయన వున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి విమర్శలు ఆయనపై వచ్చాయి. కానీ వాటి నుంచి పాఠాలను నేర్చుకుంటున్నట్లు మంత్రిగారు కనబడటంలేదంటూ చెపుతున్నారు. తిరుపతి విమానాశ్రయం వద్ద జరిగిన ఆనాటి కార్యక్రమం తాలూకు వీడియో చూడండి.