బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By vasu
Last Modified: గురువారం, 4 మే 2017 (21:24 IST)

యువత గుళ్లూ గోపురాలకు వెళ్లడం ఓ విహార యాత్రలా మారిందా..?

రోజు రోజుకీ మన పరిస్థితి దిగజారుతోందని గ్రహించిన శ్రీశ్రీ అంతకు ముందెప్పుడే ఎముకలు క్రుళ్లిన వయస్సు మళ్లిన సోమరులారా చావండి అని బాధ పడ్డాడంటే భవిష్య పరిస్థితిపై ఆయనకు ఎంతటి అవగాహనో అనిపిస్తుంది. మన యువతరం పరిస్థితి ప్రస్తుతానికి అలాగే ఉంది.

రోజు రోజుకీ మన పరిస్థితి దిగజారుతోందని గ్రహించిన శ్రీశ్రీ అంతకు ముందెప్పుడే ఎముకలు క్రుళ్లిన వయస్సు మళ్లిన సోమరులారా చావండి అని బాధ పడ్డాడంటే భవిష్య పరిస్థితిపై ఆయనకు ఎంతటి అవగాహనో అనిపిస్తుంది.
 
మన యువతరం పరిస్థితి ప్రస్తుతానికి అలాగే ఉంది. ఒకప్పటి కాలంలో అంటే మన నాన్నలు, తాతల కాలంలో చిన్న పిల్లలు దేవుళ్ల ప్రతిరూపాలుగా చెప్పబడుతూంటే, బాల్య దశకు చేరిన పిల్లలకు అమ్మ, నాన్న, గురువు, చదువులు దైవాలుగా చెప్పబడేవారు. తర్వాత చదువు ముగిసాక అమ్మ, నాన్న, గురువులతో పాటుగా బాధ్యత అనే దైవం కూడా జోడించబడేది. 
 
కానీ ఇప్పటి తరానికి అమ్మ, నాన్నలంటే స్నేహితుల నుండి దూరం చేసే నస పెట్టే పాత్రలు, చదువు, బాధ్యతలనేవి ఎగ్జామ్ హాల్‌లలో స్నేహితులు చూపించే ఆన్సర్ షీట్‌లుగా మారిపోయాయి. అయితే వీటి నుండి మినహాయించబడినట్లు గుళ్లు గోపురాల యాత్రలకు మాత్రం యువతరం లోటు చేయడం లేదనేది అతిశయోక్తి కాదు. ఎందుకంటే వారి దృష్టిలో అది స్నేహితులతో కలిసి చేసే విహారయాత్ర. అమ్మానాన్నలు రెక్కలుముక్కలు చేసుకొని తినీతినక ముడుపులు కట్టి దైవ దర్శనాలకని పంపితే వాటినీ విహారయాత్రలుగా మార్చుకోవడం నేటి యువతరం ఫ్యాషన్‌గా ఇంకా చెప్పాలంటే వీరికి నచ్చినట్లు కనబడితే అదే భక్తిగా దైవలీలగా చెప్పుకునేస్తున్నారు. 
 
వీటికి పరాకాష్టగా ఈ మధ్య ఒకచోట బాహుబలి గురించి వ్రాస్తూ... "బాలీవుడ్ పీకే, ఓ మై గాడ్ (గోపాలా గోపాలా) వంటి సినిమాలతో హిందుత్వాన్ని అవమానిస్తే... బాహుబలితో హిందుత్వాన్ని ఉన్నత స్థితికి తెచ్చారు" అని ప్రకటించడం కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది. మనిషిగా పుట్టినందుకు సాటి మనిషికి సాయపడండి.. అందులో కూడా దైవత్వముందనే సందేశాలను కూడా బేఖాతరు చేస్తున్న ఈ యువతరం సినిమాలను కూడా కండలు మెలితిరిగి సస్పెన్స్‌లతో కూడి ఉంటే తప్ప అంగీకరించరేమో..
 
అలా కాకుండా, బాధ్యత ఎరిగిన యువతరం కోసం పక్క మనిషికి సాయం చేయడంలో కూడా దైవత్వముందని చెప్పాల్సిన బాధ్యతను మనం మరిచిపోతున్నామా... లేక మనమే విశ్వసించలేకున్నామా...?